iDreamPost

తెలంగాణలో TDP పోటీపై క్లారిటీ ఇచ్చిన కాసాని!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీలో అసంతృప్తి నేతలు ఏ క్షణంలో జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీలో అసంతృప్తి నేతలు ఏ క్షణంలో జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో TDP పోటీపై క్లారిటీ ఇచ్చిన కాసాని!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలోకి కొంతమంది జంప్ అయితే.. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ కండువ కప్పుకుంటున్నవారి సంఖ్య భారీగానే పెరిగిపోతుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా ? అన్న విషయంపై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా ఈ అంశంపై టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఇటీవల అసంతృప్తి నేతలు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. తెలంగాణ టీడీపీ కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల పార్టీ వీడనున్నారని.. త్వరలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు ఆయన టీడీపీ తరుపున 89 స్థానాల్లో పోటీ చేయబోతున్నారని అంటున్నారు. మొత్తానికి ఆయన పోటీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాసాని తాను పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టీడీపీ పోటీచేసే అంశం గురించి పార్టీ అధినేత చంద్రబాబు తో ములాఖత్ అయ్యాం. పార్టీ టికెట్ల విషయం గురించి అందరితో చర్చించి రేపు ఫైనల్ చేస్తామని అన్నారు. రేపు టీడీపీ అగ్రనేత లోకేష్ తో సమావేశం అయిన తర్వాత వీలైనంత వరకు ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తాం. ఏపీలో కన్నా తెలంగాణ లోనే టీడీపీ పటిష్టంగా ఉంది. నాపై వస్తున్నవన్నీ ప్రచారాలే.. ఎవరూ నమ్మోద్దు’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి