iDreamPost

పెళ్లిలో అల్లుడికి అత్తామామలు కాళ్లు కడగడం తప్పని సరికాదు : హైకోర్టు

పెళ్లి తంతులో ముహుర్తం ఎంత ముఖ్యమో.. అలాగే కన్యాదానం ప్రక్రియను కూడా అంతే ముఖ్యమని భావిస్తుంటారు. కాబోయే అల్లుడికి అమ్మాయి తల్లిదండ్రులు కాళ్లు కడిగే ప్రక్రియనే ఈ కన్యాదానం. దీనిపై ఓ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

పెళ్లి తంతులో ముహుర్తం ఎంత ముఖ్యమో.. అలాగే కన్యాదానం ప్రక్రియను కూడా అంతే ముఖ్యమని భావిస్తుంటారు. కాబోయే అల్లుడికి అమ్మాయి తల్లిదండ్రులు కాళ్లు కడిగే ప్రక్రియనే ఈ కన్యాదానం. దీనిపై ఓ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

పెళ్లిలో అల్లుడికి అత్తామామలు కాళ్లు కడగడం తప్పని సరికాదు : హైకోర్టు

వివాహ తంతులో చాలా ముఖ్యమైనదిగా భావిస్తుంటారు కన్యాదానం. పిల్లనిచ్చే తండ్రి..కాబోయే అల్లుడికి తన కూతుర్ని దానం ఇచ్చే ప్రక్రియనే కన్యాదానం. ఇది హిందూ సంప్రదాయం.ఎన్నో ఏళ్ల నుండి దీన్ని పాటిస్తున్నారు వధువు తల్లిదండ్రులు. అల్లుడికి కాలు కడిగి కన్యాదానం చేస్తారు. లక్ష్మి స్వరూపి అయిన తన కుమార్తెను అల్లుడ్ని శ్రీ మహా విష్ణువుగా భావించి అతడి చేతిలో పెడతారు . భార్య జీవితంలో వెలకట్టలేని అపురూపమైన బహుమతిగా పేర్కొంటారు. ఇది దానాల్లో గొప్పదానంగా కూడా పేర్కొంటారు. అశ్వమేథ యాగం చేసినంత పుణ్యంగా కూడా పరిగణిస్తుంటారు. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ అత్తారింట్లో లభించాలన్న ఉద్దేశంతో ఇది చేస్తారు. కానీ కొంత మంది దీన్ని వ్యతిరేకిస్తుంటారు కూడా.

తాజాగా ఈ కాళ్లు కడిగి కన్యాదానం చేసే ప్రక్రియను కోర్టు కూడా వ్యతిరేకించింది. కన్యాదానం తప్పనిసరేం కాదని తీర్పు నిచ్చింది. అట్లాగే సప్తపది మాత్రమే పెళ్లిలో తప్పనిసరిగా చేయాల్సిన వేడుకగా పేర్కొంది. ఓ కేసు విషయమై అలహాబాద్ హైకోర్టు కన్యాదానంపై కీలక తీర్పునిచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..? అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి.. హిందూ సంప్రదాయం ప్రకారం తన అత్తమామలు తనకు కన్యాదానం చేయలేదని, కాబట్టి ఈ పెళ్లి చెల్లదని పేర్కొంటూ క్రిమినల్ కేసు పెట్టాడు. గత నెల మార్చి 6న దీనికి సంబంధించి లక్నో బెంచ్‌లో రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జడ్జి .. పెళ్లిలో వరుడికి అత్తామామలు కాళ్లు కడిగి కన్యాదానం చేయడం తప్పని సరి కాదని తేల్చి చెప్పారు.

అలాగే ఏడడగులు వేయడం అనగా సప్తపది మాత్రమే తప్పని సరి అని పేర్కొన్నారు జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం. ‘కన్యాదానం అనేది ఓ తండ్రి తన కుమార్తెకు ఇచ్చి వివాహం చేసే సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఇది ఒక కుటుంబం మరొక కుటుంబానికి బాధ్యత, సంరక్షణను ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియ. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. సప్తపది (అగ్ని చుట్టు వధూవరులు ఏడు అడుగులు వేయడం) మాత్రమే పెళ్లిగా నిర్దారిస్తుంది’ అని పేర్కొంటూ అత్తమామలపై అల్లుడు అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు జడ్జి. కాగా, కన్యాదానాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన మహిళలతో పాటు ఉన్నతమైన ఆలోచనలతో ఉంటున్న పురుషులు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. మరీ కన్యాదానం తప్పని సరిగా ఉండాలా లేక వద్దా .. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి