iDreamPost

ప్రపంచ నెం.1గా విలియమ్సన్‌! భారత్‌ నుంచి టాప్‌ 10లో ఒక్కడే

  • Published Jul 05, 2023 | 3:31 PMUpdated Jul 05, 2023 | 3:31 PM
  • Published Jul 05, 2023 | 3:31 PMUpdated Jul 05, 2023 | 3:31 PM
ప్రపంచ నెం.1గా విలియమ్సన్‌! భారత్‌ నుంచి టాప్‌ 10లో ఒక్కడే

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ స్థానాన్ని అధిరోహించాడు. 883 పాయింట్లతో టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా నిలిచాడు. కేన్‌ మామ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, ట్రావిస్‌ హెడ్‌ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. తాజాగా మారిన ర్యాంకింగ్స్‌ నేపథ్యంలో కేన్‌ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌, ఆరో స్థానంలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఉన్నారు.

అయితే టాప్‌ 10లో ఒకే ఒక భారత క్రికెటర్‌ ఉండటం గమనార్హం. కారు ప్రమాదంలో గాయపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎటాకింగ్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ పదోవ స్థానంలో నిలిచాడు. బ్యాటర్ల జాబితాలో టీమిండియా పరిస్థితి దారుణంగా ఉన్నా.. బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగాల్లో మనోళ్లే టాప్‌లో ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే రవీంద్ర జడేజా వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌గా ఉన్నాడు.

అలాగే బౌలింగ్‌లో బుమ్రా 8వ స్థానంలో, జడేజా 9వ స్థానంలో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అశ్విన్‌ రెండో స్థానంలో, అక్షర్‌ పటేల్‌ 5వ ప్లేస్‌లో ఉన్నారు. బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల పరంగా పర్వాలేకున్నా.. బ్యాటింగ్‌లోనే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ ఫైనల్స్‌ ఆడిన జట్టు నుంచి టాప్‌ 10వ ఒకే ఒక బ్యాటర్‌ ఉండటం నిజంగా అవమానకర విషయం. పైగా ఉన్న ఒక్క ఆటగాడు సైతం చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడ. మరి ఈ విషంయలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి