iDreamPost

Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ కన్నా అమితాబ్ అంత ఎత్తు ఉండటానికి కారణం?

  • Published Jun 11, 2024 | 2:27 PMUpdated Jun 11, 2024 | 2:27 PM

కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ సోమవారం నాడు విడుదలయ్యింది. పిచ్చేక్కించే విజువల్స్‌తో సినిమా మీద అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు నాగ్‌ అశ్విన్‌. ఇక ట్రైలర్‌లో చూస్తే.. కల్కిలో ప్రభాస్ కన్నా అమితాబ్ చాలా ఎత్తు ఉన్నాడు. అందుకు కారణం ఏంటి అంటే..

కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ సోమవారం నాడు విడుదలయ్యింది. పిచ్చేక్కించే విజువల్స్‌తో సినిమా మీద అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు నాగ్‌ అశ్విన్‌. ఇక ట్రైలర్‌లో చూస్తే.. కల్కిలో ప్రభాస్ కన్నా అమితాబ్ చాలా ఎత్తు ఉన్నాడు. అందుకు కారణం ఏంటి అంటే..

  • Published Jun 11, 2024 | 2:27 PMUpdated Jun 11, 2024 | 2:27 PM
Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ కన్నా అమితాబ్ అంత ఎత్తు ఉండటానికి కారణం?

కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూడు.. ఇదే పేరు వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక జూన్‌ 27న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో.. మేకర్స్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ విడుదల అయ్యింది. ఇది చూసిన వారు.. నాగ్‌ అశ్విన్‌ క్రియేటివిటీకి బిత్తరపోతున్నారు. ఏంది నాగ్‌ మామ.. హాలీవుడ్‌ అమ్మ మొగుడులా కల్కిని తీర్చి దిద్దావ్‌ కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక కల్కి ట్రైలర్‌ చూసిన వాళ్లు ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గ సినిమా అంటే ఇదే అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక కల్కి ట్రైలర్‌లోని ప్రతి అంశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలోని ఎన్నో ఆసక్తికర ఎలివెంట్స్‌ గురించి ట్రైలర్‌లో చూపించారు.

ఇక ట్రైలర్‌ చూస్తే.. ఈ చిత్రంలో ప్రభాస్‌ కల్కి కాదు.. దీపికా పదుకోన్‌ గర్భాన కల్కి జన్మించబోతున్నట్లుగా చూపించబోతున్నారు ఆ బిడ్డ కోసం కాంప్లెక్స్‌ సుప్రీం గాడ్‌ యాస్కిన్‌ వెతుకుతుంటే.. అశ్వత్థామ మాత్రం ఆ బిడ్డను కాపాడతానని ప్రతిన బూనినట్లు అర్థం అవుతోంది. ఇక దీపికా కడుపులోని బిడ్డను తీసుకెళ్లడం కోసం భైరవ్‌ అక్కడకు వస్తాడు. ఈ క్రమంలో అశ్వత్థామకు, భైరవ్‌కు మధ్య భీకర పోరాటం సాగనున్నట్లు ట్రైరల్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇక భైరవ, అశ్వత్థామ ఇద్దరూ తలపడే సీన్‌ చేస్తే.. గూస్‌బంప్స్‌ రాక మానవు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోన్న అంశం ఏంటంటే.. అశ్వత్థామ ముందు భైరవ.. చాలా చిన్నగా కనపిస్తాడు. మరి దీని వెనక ఏదైనా కారణం ఉందా.. అంటే ఉంది అంటున్నారు నిపుణులు.

అశ్వత్థామ కలియుగానికి చెందిన వాడు కాదు. అతడు శ్రీృకృష్ణుడు జన్మించిన ద్వాపర యుగానికి చెందిన వాడు కావడం వల్ల అశ్వత్థామ ఎత్తు 9 అడుగులపైనే ఉన్నాడు. ఇక భైరవ విషయానికి వస్తే.. అతడు కలియుగానికి చెందిన వ్యక్తి కావడం వల్ల భైరవ.. అశ్వత్థామ ముందు అతడు చాలా చిన్నగా ఉన్నాడు. కానీ ఏమాత్రం తడబడకుండా.. భైరవ, అశ్వత్థామతో తలపడి.. కలబడటం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్‌ మాత్రం పిచ్చెక్కించడమే కాక సినిమా మీద అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక మూవీ ఎలా ఉండనుందో అర్థం కావాలంటే.. కల్కి విడుదలయ్యేవరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి