iDreamPost

Kalki 2898AD: కల్కి సినిమాలో ఆ ఒక్క సాంగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో తెలుసా!

  • Published Jun 15, 2024 | 11:02 AMUpdated Jun 15, 2024 | 11:02 AM

కల్కి.. ఈ పేరు వింటేనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఊపులో ఉన్నారు.. ప్రభాస్ అభిమానులు. ఇప్పటికే వచ్చిన అన్ని అప్ డేట్స్ బాగా హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

కల్కి.. ఈ పేరు వింటేనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఊపులో ఉన్నారు.. ప్రభాస్ అభిమానులు. ఇప్పటికే వచ్చిన అన్ని అప్ డేట్స్ బాగా హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 15, 2024 | 11:02 AMUpdated Jun 15, 2024 | 11:02 AM
Kalki 2898AD: కల్కి సినిమాలో ఆ ఒక్క సాంగ్ కోసం ఎన్ని కోట్లు  ఖర్చుపెట్టారో తెలుసా!

కల్కి సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అభిమానులు మొదట నిరాశ పడిన కానీ, ఈ రేంజ్ సినిమా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అనే భావనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను దాదాపు కల్కి ప్రపంచంలోకి తీసుకుని వెళ్లి.. ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో ఆసక్తి పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కేవలం ఈ సాంగ్ కోసం కేటాయించిన బడ్జెట్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సినిమాకు జరగని విధంగా నాగ్ అశ్విన్ కల్కి సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. బెస్ట్ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా కల్కి రాబోతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఈ సినిమా జూన్ 27 తర్వాత ఇండస్ట్రీలో వండర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు ఈ సినిమాను 600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ , యానిమేటెడ్ సిరీస్ , స్పెషల్ కార్ బుజ్జి.. ప్రతిదీ కూడా ప్రేక్షకులలో బాగా ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారంట మేకర్స్. ఈ సాంగ్ కోసం కేటాయించిన బడ్జెట్ తెలిస్తే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. ఈ సాంగ్ ను ఏకంగా 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం, పైగా ఈ ఒక్క సాంగ్ కోసం స్టార్ సింగర్ దల్జీత్ దూసాంజ్ ని రంగంలోకి దించారు మేకర్స్.

ఈ సాంగ్ లో దల్జీత్ దూసాంజ్ తో పాటు.. ప్రభాస్ కూడా కనిపిస్తాడంటా.. ఈ సాంగ్ ను జూన్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి ఈ సాంగ్ అన్ని భాషలలో ఉంటుందా.. లేదా కేవలం హిందీలోనే ఉంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక దల్జీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ సింగర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ సాంగ్ కోసం దల్జీత్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమా మొదటి రోజే గ్రాండ్ ఓపెనింగ్ వచ్చేలా .. 2D , 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత.. కొన్ని లక్షల మంది అంచనాలను అందుకుంటుందా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి