iDreamPost

బాబు అరెస్ట్ పై Jr. NTR సైలెన్స్! తారక్ తేల్చి చెప్పాడా?

  • Author Soma Sekhar Updated - 09:53 AM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Updated - 09:53 AM, Mon - 11 September 23
బాబు అరెస్ట్ పై Jr. NTR సైలెన్స్! తారక్ తేల్చి చెప్పాడా?

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్ పై కుటుంబ సభ్యులు అయిన పురంధరేశ్వరి, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్పందించారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. పక్కా ఆధారాలతో ఏపీ సీఐడి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. అదీకాక న్యాయస్థానంలో వాదనల తర్వాత బాబుకు 14 రోజుల రిమాండ్ ను కూడా విధించింది. ఈ నేపథ్యంలో బాబు అరెస్ట్ పై స్పందించకుండా ఎన్టీఆర్ మౌనంగా ఉండటంతో తాను టీడీపీకి దూరం అని చెప్పకనే చెప్పాడా? అంటున్నారు ఫ్యాన్స్.

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఇటు కుటుంబ సభ్యులు, అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పురంధరేశ్వరి, చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ బాబు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. బాబు అరెస్ట్ పై ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించలేదు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అరెస్ట్, రిమాండ్ విధించిన తర్వాత కూడా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే యంగ్ టైగర్ మౌనానికి కారణాలు లేకపోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ సీఐడికి అడ్డంగా దొరికిపోవడం, పోలీసులు, న్యాయస్థానం తమ పనితాము చేసుకుపోవడంతో తారక్ సైలెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని, కర్మ ఫలితాన్ని ఎవ్వరూ ధిక్కరించలేరని తారక్ అనుకుంటున్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదీకాక గత కొంతకాలంగా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు తారక్. అయితే న్యాయస్థానం తీర్పునకు తారక్ గౌరవం ఇచ్చాడు కనుకనే ఈ మెుత్తం వ్యవహారంపై యంగ్ టైగర్ సైలెన్స్ గా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో తాను పార్టీకి, చంద్రబాబుకు దూరంగా ఉన్నానని తారక్ తేల్చిచెప్పాడా? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఇక టీడీపీ పార్టీ పగ్గాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేపట్టాలని ఎప్పటి నుంచో తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయంపై యంగ్ టైగర్ ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే బాబు అరెస్ట్ తోనైనా తారక్ స్పందిస్తాడని కొందరు అనుకున్నారు. కానీ తారక్ ఇప్పటి వరకు ఈ మెుత్తం అరెస్ట్ వ్యవహారంపై స్పందించలేదు. దీంతో తాను టీడీపీకి దూరం అని తేల్చి చెప్పాడని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై తారక్ స్పందించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి