iDreamPost

టెన్త్, ITI అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 69,100 జీతం

ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఏకంగా రూ. 69,100 జీతాన్ని అందిస్తారు. పూర్తి సమాచారం మీకోసం..

ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఏకంగా రూ. 69,100 జీతాన్ని అందిస్తారు. పూర్తి సమాచారం మీకోసం..

టెన్త్, ITI అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 69,100 జీతం

మీరు టెన్త్, ఐటీఐ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఇస్రోలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంస్థలోని 54 టెక్నిషీయన్ బీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 69,100 జీతాన్ని అందుకోవచ్చు. ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎన్ఆర్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ nrsc.gov.inను పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • టెక్నిషీయన్ బీ పోస్టులు

మొత్తం ఖాళీలు:

  • 54

ఖాళీల వివరాలు:

  • డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ -2 పోస్టులు
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ – 33 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ -8 పోస్టులు
  • ఫొటో గ్రఫి -02
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 09

వయోపరిమితి:

  • డిసెంబర్ 31 , 2023 నాటికి 18 నుంచి 35 మధ్య వయస్సు ఉండాలి. ఆయా కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హత:

  • సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ/ఎన్సీవీటీ సర్టిఫికెట్ తో పాటు 10వ తరగతి హైస్కూల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి 69,100 వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్ఖులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం అభ్యర్థులందరు రూ. 500 చెల్లించాలి. ఈ ఫీజును రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తిరిగి రిఫండ్ చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 09-12-2023

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-12-2023

ఎన్ఆర్ఎస్సీ అధికారిక వెబ్ సైట్:

nrsc.gov.in

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి