iDreamPost

ఇంగ్లాండ్ గడ్డపై జయదేవ్ ఉనద్కత్ దండయాత్ర! ఏకంగా 9 వికెట్లతో..

  • Author Soma Sekhar Published - 08:06 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 08:06 PM, Thu - 14 September 23
ఇంగ్లాండ్ గడ్డపై జయదేవ్ ఉనద్కత్ దండయాత్ర! ఏకంగా 9 వికెట్లతో..

టీమిండియాలో చోటు కోల్పోయిన చాలా మంది క్రికెటర్లు ఇంగ్లాండ్ కౌంటీల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కకపోవడంతో.. లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ తన సూపర్ బౌలింగ్ తో ప్రత్యర్థి పనిపడుతున్నాడు. అలాగే టీమిండియా మరో బౌలర్ కూడా ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగుతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై వికెట్ల దండయాత్ర చేస్తున్నాడు. అతడే టీమిండియా వెటరన్ స్టార్ పేసర్ జయదేవ్ ఉనద్కత్. లీసెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్ లో అతడు 9 వికెట్లతో చెలరేగడం విశేషం. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

జయదేవ్ ఉనద్కత్.. కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్ లో భాగంగా.. ససెక్స్ టీమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక ఈ కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా తాజాగా లీసెస్టర్ షైర్ తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అత్యుత్తమమైన గణాంకాలను నమోదు చేశాడు ఉనద్కత్. ఇతడి అద్బుతమ బౌలింగ్ కారణంగా.. ససెక్స్ జట్టు 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో లీసెస్టర్ షైర్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. ససెక్స్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లతో రాణించాడు.

కాగా.. రెండో ఇన్నింగ్స్ లో మరింతగా చెలరేగాడు జయదేవ్ ఉనద్కత్. 499 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లీసెస్టర్ షైర్ జట్టును కాకవికలం చేశాడు ఈ వెటరన్ పేసర్. తన అనుభవానంతా రంగరించి ఇంగ్లాండ్ గడ్డపై వికెట్ల దండయాత్ర చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో చెలరేగాడు ఈ స్టార్ పేసర్. దీంతో విజయానికి చేరువగా వచ్చిన ప్రత్యర్థి 15 పరుగుల దూరంలో ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు చిరస్మరణియ విజయాన్ని నమోదు చేసింది. మరి 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి