iDreamPost

జనసేనలో ‘రుక్మిణి’ జపం.. ఇక నాదెండ్ల పరిస్థితి అంతేనా?

  • Published Oct 25, 2023 | 10:19 AMUpdated Oct 25, 2023 | 10:19 AM

జనసేన పార్టీ అనగానే సామాన్యులు మొదలు.. ఆ పార్టీ కార్యకర్తల వరకు అందరికి గుర్తుకు వచ్చే పేర్లు పవన్‌, నాదెండ్ల మనోహర్‌, నాగబాబు మాత్రమే. కానీ ప్రస్తుతం రుక్మిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పైగా ఆమె నాదెండ్ల మనోహర్‌కు పోటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఇంతకు ఎవరీ రుక్మిణి అంటే..

జనసేన పార్టీ అనగానే సామాన్యులు మొదలు.. ఆ పార్టీ కార్యకర్తల వరకు అందరికి గుర్తుకు వచ్చే పేర్లు పవన్‌, నాదెండ్ల మనోహర్‌, నాగబాబు మాత్రమే. కానీ ప్రస్తుతం రుక్మిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పైగా ఆమె నాదెండ్ల మనోహర్‌కు పోటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఇంతకు ఎవరీ రుక్మిణి అంటే..

  • Published Oct 25, 2023 | 10:19 AMUpdated Oct 25, 2023 | 10:19 AM
జనసేనలో ‘రుక్మిణి’ జపం.. ఇక నాదెండ్ల పరిస్థితి అంతేనా?

జనసేన పార్టీ ప్రారంభించి దశాబ్దంపైగానే అవుతుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. కేవలం ఎన్నికల ముందు మాత్రమే జనాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి చూడరు. అందుకే పార్టీ స్థాపించి దశాబ్దానికి పైగా అవుతున్నా జనాల్లో మాత్రం ఇంకా సరైన గుర్తింపు రాలేదు. నేటికి కూడా జనసేన పార్టీ అంటే కేవలం పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ వంటి నేతల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. జనాల సంగతి పక్కకు పెడితే.. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా జనసేన పార్టీ కీలక నేతలు ఎవరూ అనే అంశం గురించి సరిగా తెలియదు.

పార్టీ అధ్యక్షుడు పవన్‌తో దేని గురించి మాట్లాడాలన్నా.. నాదెండ్ల మనోహర్‌ ద్వారా మాత్రమే వెళ్లాలి. మొన్నటి వరకు పరిస్థితి ఇలానే ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం.. ఓ యువతి పేరు మార్మొగిపోతుంది. నాదెండ్ల కన్నా ఆమెనే ఇప్పుడు జనసేనలో పవర్‌ఫుల్‌ అంట.. జనసేన పార్టీ గేటు దాటి రావాలన్న.. ఆమె పర్మిషనే కావాలంట. మరి ఇంతకు ఎవరా యువతి.. ఆమె కథ ఏంటి అంటే..

ప్రస్తుతం జనసేన వర్గాలు ఎక్కువగా జపం చేస్తున్న పేరు రుక్మిణి కోట. పార్టీలో ప్రస్తుతం పవర్‌ అంతా ఆమెదేనట. ఇన్నాళ్ల నుంచి ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు కానీ.. తాజాగా రాయ‌ల‌సీమ జిల్లాల మ‌హిళా నాయకురాలు ప‌సుపులేటి ప‌ద్మావ‌తి జనసేనకు రాజీనామా చేసిన తర్వాత.. రుక్మిణి పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే.. పద్మావతి.. త‌న రాజీనామా లేఖ‌లో 140 రోజుల పాటు రుక్మిణి తనను ఎలా ఆడుకున్నారో చాలా స్పష్టంగా వివరించారు.

ఇక పార్టీలో రుక్మిణి బాధితులు చాలా మంది ఉన్నారని.. వారు బయటకు చెప్పకోలేక నరకం అనుభవిస్తున్నారు అని పద్మావతి తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎక్కడ చూసిన రుక్మిణి పేరే వినిపిస్తోంది. మరి ఇంతకు ఎవరీ రుక్మిణి అంటే..

రుక్మిణి నేపథ్యం ఇదే..

కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండ‌న్‌లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్‌ బట్టల షాపును నిర్వహించేవారని తెలుస్తోంది. ప‌వ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న‌కు కావాల్సిన సౌక‌ర్యాలు క‌ల్పించేవార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో 2020లో పవన్‌ కళ్యాణ్‌.. రుక్మిణిని జ‌న‌సేన సెంట్ర‌ల్ అఫైర్స్ క‌మిటీ వైస్ చైర్మ‌న్‌గా నియ‌మించారు.

ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో ఒకటైన జ‌న‌సేన వీర‌మ‌హిళ‌ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఆమె 2020 నుంచి పార్టీలో ఉంటున్నప్పటి.. గతేడాది అనగా 2022 లో లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కు వచ్చారట. ఈ క్రమంలో ఆమెకు తొలుత హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌య బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. ఆ తర్వాత పార్టీలో కీలక నేతగా ఎదిగారట.

పార్టీ నేతలను ఇబ్బంది పెడుతోన్న రుక్మిణి

పార్టీలో చేరిన తర్వాత కార్యకర్తలను కలుపుకుని పోవాల్సింది పోయి.. రుక్మిణి మాత్రం వారి మీద పెత్తనం చెలాయిస్తున్నారట. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్‌లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పార్టీలో పెత్తనం అంతా రుక్మిణిదేనట. జనసేనలో ఎంత పెద్ద నాయకుడైనా సరే.. ప‌వ‌న్‌ను క‌ల‌వాలంటే.. రుక్మిణి పర్మిషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

రుక్మిణి అనుమతి ఇస్తేనే ప‌వ‌న్ వ‌ద్ద‌కు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జ‌న‌సేన కార్యాల‌యం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన ప‌సుపులేటి ప‌ద్మావ‌తి తన లేఖలో పేర్కొన్నారు. దాంతో ప్రస్తుతం జనసేనలో ఎక్కడ చూసినా రుక్మిణి పేరే వినిపిస్తోంది. అంతేకాక ఈమె స్పీడ్‌ చూస్తే.. త్వరలోనే నాదెండ్ల మనోహర్‌కి కూడా చెక్‌ పెట్టగలదని.. ఆమె స్పీడ్‌ ముందు నాదెండ్ల మనోహర్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అంటూ ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి