iDreamPost

జైలర్.. ఓటిటి రిలీజ్ కి ఆ డేట్ కన్ఫర్మ్ చేశారా..?

  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
జైలర్.. ఓటిటి రిలీజ్ కి ఆ డేట్ కన్ఫర్మ్ చేశారా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ నమోదు చేస్తోంది. రిలీజ్ ముందే పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ బజ్ క్రియేట్ చేసిన జైలర్.. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి హిట్ జోన్ లో చేరింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఏకంగా రూ. 600 కోట్ల క్లబ్ లో చేరి.. ఈ ఏడాది కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కొన్నాళ్ళుగా సరైన కంబ్యాక్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రజినీకి.. జైలర్ ఊహించని విజయాన్ని అందించి.. అనుకున్న దానికంటే సాలిడ్ హిట్ ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సూపర్ స్టార్ స్టామినా జీరో ప్రమోషన్స్ తో కూడా ప్రూవ్ చేసింది జైలర్. కేవలం తమిళనాడు వరకు భారీగా ప్రమోషన్స్ జరుపుకున్న ఈ సినిమా.. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో జీరో ప్రమోషన్స్ తో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ.. తెలుగు, కన్నడ భాషలలో దాదాపు రూ. 55 కోట్లకు పైగా వసూల్ చేసింది. కేజీఎఫ్, కాంతార సినిమాల తర్వాత ఏ డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేదు. స్ట్రెయిట్ ఫిలిమ్స్ కొట్టలేకపోతున్న కలెక్షన్స్ ని.. జైలర్ డబ్బింగ్ రూపంలో వచ్చి.. రికార్డులు తిరిగరాయడం మామూలు విషయం కాదు. ఇలాంటి అరుదైన ఫీట్స్ ఆయనకే సాధ్యం అని మరోసారి ప్రూవ్ చేశారు రజినీ.

ఇదిలా ఉండగా.. జైలర్ విడుదలై మూడు వారాలు దాటినా.. నాలుగో వారంలోను థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. దీనికి పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. నిలబడలేకపోతున్నాయి. అయితే.. జైలర్ సినిమా థియేట్రికల్ గా బిగ్గెస్ట్ హిట్. కాబట్టి.. ఈ సినిమా ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రాదని అనుకుంటున్నారు ఆడియన్స్. కానీ.. ఊహించని విధంగా ఈ సినిమా.. సెప్టెంబర్ 7న రానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సన్ పిక్చర్స్ వారి సన్ నెక్స్ట్ ఓటిటి సొంతం చేసుకుంది. కాగా.. ముందుగా వినాయక చవితి సందర్బంగా ఓటిటి రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ.. అనుకోని కారణాల వలన ముందే వస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరి జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి