iDreamPost

చంద్రబాబు ఓటమిలో ఎల్లోమీడియా బాధ్యత లేదా ?

చంద్రబాబు ఓటమిలో  ఎల్లోమీడియా బాధ్యత లేదా ?

అవును ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఓటమికి ప్రధాన కారణాల్లో ఎల్లోమీడియా కూడా ఒకటనే అనే విషయం ఇప్పటికీ టిడిపిలో నేతలు చెప్పుకుంటారు. గురివింద గింజ తన నలుపు తాను ఎరగదన్న పద్దతిలో ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం వేమూరి రాధాకృష్ణ రాసే ’కొత్తపలుకు’లో జగన్మోహన్ రెడ్డి చేయించిన దుష్ప్రచారంతోనే చంద్రబాబు ఓడిపోయినట్లు తెగ బాధిపడిపోయాడు. చంద్రబాబు పాలనపై ఓ పద్దతి ప్రకారం మేధావులతో జగన్ వ్యతిరేక ప్రచారం చేయించాడట. రిటైర్డ్ జస్టిస్ లక్ష్మాణరెడ్డి, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య, అజయ్ కల్లం లాంటి వాళ్ళను ఉపయోగించుకున్నాడంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది.

నిజంగా పై ముగ్గురు ప్రముఖులు చెబితే జనాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటేశారా ? అన్నదే ప్రధాన ప్రశ్న. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్నీ వర్గాలను దూరం చేసుకున్నది వాస్తవం. అవినీతి, అరాచకాలు విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నది నిజం. 2014లో అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాల్లో ఒకటైన రుణమాఫీ హామీని తుంగలో తొక్కింది ఎవరు ? రైతులకు, డ్వాక్రా, చేనేతలకు ఇచ్చిన రుణమాఫీ హామీని తప్పినందుకే పై వర్గాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయింది. దీనికి జగనో లేకపోతే పైన చెప్పిన ప్రముఖులో కారణం కాదు కదా ?

ఇక అవినీతికి కూడా విపరీతంగా పెరిగిపోయింది. పట్టిసీమలో అవినీతి జరగకపోయినా జరిగినట్లు జగన్ ప్రచారం చేయించాడని రాధాకృష్ణ తెగ బాధపడిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ తన నివేదికలో చెప్పింది తప్పా ? కాగ్ నివేదికను అప్పటి బిజెపి ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే చదవి వినిపించిన విషయం ఎల్లోమీడియా మరచిపోయిందేమో. అదే సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును దివంగత వైఎస్సేరే నిర్మించారని వైసిపి నేతలు చెప్పుకుంటున్నారట. ప్రాజెక్టును కట్టింది వైఎస్సార్ అని వైసిపి నేతలు చెప్పలేదు. అయితే ప్రాజెక్టు కాలువలను తవ్వించింది మాత్రం వైఎస్సార్ అని మాత్రమే చెప్పారు.

తన ఐదేళ్ళ పాలన కేవలం కొంతమంది ప్రయోజనాల కోసమే అన్నట్లుగా వ్యవహరించిన చంద్రబాబు పై మిగిలిన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నది వాస్తవం. టిడిపి ఘోర ఓటమికి చంద్రబాబు పాలనే కారణమని స్వయంగా టిడిపి నేతలే చెబుతుంటే రాధాకృష్ణ మాత్రం జగన్ చేసిన, చేయించిన దుష్ప్రచారమని చెప్పటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటంలో విఫలమైంది వాస్తవం. ఇదే విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితులైన ఎంపి సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా బహిరంగంగానే అంగీకరించిన విషయం బహుశా రాధాకృష్ణ మరచిపోయారేమో.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టిడిపిలో జరిగిన చర్చ ఏమిటంటే చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణమే ఎల్లోమీడియా అని. తన పాలనలోని లోపాలను బయటపడకుండా, జనాల్లోని వ్యతిరేకత చంద్రబాబుకు కనబడకుండా ఎల్లోమీడియానే అడ్డుగా నిలబడిందని నేతలు చాలామంది బహిరంగంగానే ఆరోపించారు. జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగిపోయినట్లు జనాలను భ్రమింప చేయాలని ఎల్లోమీడియా తెగ ప్రయత్నించింది. అదే సమయంలో అరాచకాలు, అవినీతి బయటపడకుండా ఎల్లోమీడియా జాగ్రత్త పడింది.

అయితే జనాలేమన్నా అమయాకులా ? వీళ్ళేమి చెబితే అది నమ్మటానికి. మెయిన్ మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న రోజులు కాబట్టి వీళ్ళ రాతలను జనాలు నమ్మలేదు. దాంతో వ్యతిరేకంగా ఓటు వేయటంతో చంద్రబాబు చిత్తుగా ఓడపోయాడు. ఈ విషయాన్ని అంగీకరించటానికి ఎల్లోమీడియా సిద్ధంగా లేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఎల్లోమీడియా తన పద్దతి మార్చుకోలేదు. అందుకనే చంద్రబాబు మీద జనాల్లో అసలు వ్యతిరేకతే లేదని ప్రచారం చేసుకుంటోంది. నిజానికి తన ఓటమిలో ఎల్లోమీడియాదే ప్రధాన బాధ్యతని చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి