iDreamPost

థియేటర్ల వద్ద సందడి ఖాయమేనా

థియేటర్ల వద్ద సందడి ఖాయమేనా

స్వాతంత్ర దినోత్సవం ఆదివారం రావడంతో ఓ సెలవు రోజు మిస్సయినా టాలీవుడ్ మాత్రం కొత్త సినిమాలతో బాక్సాఫీస్ ను కళకళలాడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ రేపు కలిపి మొత్తం తొమ్మిది సినిమాలు బరిలో దిగబోతున్నాయి. ఇందులో డబ్బింగ్ వి కూడా ఉన్నప్పటికీ టికెట్ కౌంటర్ల దగ్గర మంచి రష్ ని ట్రేడ్ ఆశిస్తోంది. అన్నిటి కంటే ఎక్కువ బజ్ ఉన్నది పాగల్ ఒక్కదానికే. విశ్వక్ సేన్ మొన్న ప్రీ రిలీజ్ లో మాట్లాడిన విధానం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ని సూచించినప్పటికీ ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు దూసుకుపోవడం ఖాయం. ఒకవేళ రివర్స్ అయితే ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాగల్ తో పాటుగా ఆర్ నారాయణమూర్తి రైతన్న కూడా రేపే రాబోతోంది. పీపుల్స్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో బిసి సెంటర్లలో బాగా వెళ్తుందని డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ రోజు సంగతి చూస్తే పూర్ణ సుందరి, బ్రాందీ డైరీస్, సిద్దార్థ్ డబ్బింగ్ మూవీ ఒరేయ్ బామ్మర్ది, రావే నా చెలియా, చైతన్యం, సలామ్ నమస్తే లు రాబోతున్నాయి. హాలీవుడ్ మూవీ కాంజూరింగ్ 3 కూడా పోటీకి సై అంది. అయితే ఇది ఆల్రెడీ ఓవర్సీస్ లో రిలీజైపోవడం, ఓటిటి ద్వారా పైరసీ వెర్షన్లు చూసేసిన మనవాళ్ళు పెదవి విరచడం రెండు నెలల క్రితమే జరిగిపోయాయి. సో అద్భుతాలేమీ జరగవు.

క్రమంగా పెరుగుతున్న రిలీజుల కౌంట్ చూస్తుంటే ఇకపై రానున్న ఆల్ ఈజ్ వెల్ అనిపించేలా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో ఇంకా లాక్ డౌన్ నిబంధనలు, థియేటర్ల మూసివేత కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి నెలకొనడం మూవీ లవర్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. వచ్చే వారం ఆల్రెడీ రాజరాజ చోర, బజార్ రౌడీలు లాక్ చేసుకోగా మరికొన్ని అనౌన్స్ చేసే పనిలో ఉన్నాయి. ఓపెనింగ్స్ తో నిమిత్తం లేకుండా ముందు థియేటర్లో రిలీజ్ చేసుకుంటే ఓటిటి, శాటిలైట్ డీల్స్ త్వరగా చేసుకునే వీలు ఉండటంతో చిన్న నిర్మాతలు ఇలా తొందరపడాల్సి వస్తోంది.

Also Read : బాక్సాఫీస్ సందడిలో మనమే ఆదర్శం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి