iDreamPost

ఈగిల్ బ్లాక్ బస్టరా….మరో బాంబ్ షెల్లా?

తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ రవితేజ ప్రత్యేక పరిచయం అక్కర లేదు. చిన్న చిన్న పాత్రల్లో నటించి ఇప్పుడు అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. రవితేజ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు.

తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ రవితేజ ప్రత్యేక పరిచయం అక్కర లేదు. చిన్న చిన్న పాత్రల్లో నటించి ఇప్పుడు అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. రవితేజ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు.

ఈగిల్ బ్లాక్ బస్టరా….మరో బాంబ్ షెల్లా?

ఇప్పుడున్న అగ్రకథానాయకులలో మాస్ మహరాజ్ రవితేజ స్టయిలే వేరు. సినిమా కథలను ఎంపిక చేసుకోవడం గానీ, ధైర్యంగా కొత్త దర్శకులకు అవకాశం కల్పించడం గానీ, తను ఫాలో అయ్యే ట్రెండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది.  ఏ కథను ఎలా ఒప్పుకుంటాడో, అదెలా సెట్స్ మీదకి వస్తుందో అంతా సైలెంట్ గా జరిగిపోతుంది. ఈగిల్ సినిమా కూడా అంతే. మొన్నీ మధ్యనే విడుదలైన టైగర్ నాగేశ్వరరావు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్ వర్క్ చేశారు. కానీ ఇవేవీ సినిమా విజయానికి సహకరించలేదు. మొత్తానికి మాస్ మహరాజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఎప్పుడూ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే రవితేజ..  టైగర్ నాగేశ్వరరావు లాటి సినిమాతో రావాల్సింది కాదు. కాకపోతే వినూత్నమైన ప్రయత్నం మంచిదే. రాబిన్ హుడ్ ఇమేజ్ ఉన్న ఓ దొంగ కథని చేయడానికి రవితేజ ముందుకు రావడం సాహసమే.. కానీ ఫలితమే నీరుకార్చింది. అంత మాత్రాన రవితేజ స్పీడు మాత్రం నీరుగార లేదు. మళ్ళీ అంతే స్పీడుగా జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమాటో గ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రవితేజ రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈగిల్ సినిమా మీద పాజిటివ్ వైబ్ నే అందించిందని చెప్పాలి. అఫ్ కోర్స్….ఇది కూడా దాదాపుగా రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగే ఉందని నెటిజన్లు అంటున్నారు.  ఊరి జనం దేవుడిలా కొలిచే పాత్రనే మళ్ళీ మరోసారి రవితేజ పోషిస్తుండడం ఇందులో ప్రత్యేకత. ఈగిల్ ఎక్కడ తిరుగుతుంది ఎక్కువగా? జనసంచారం లేని, ఆరణ్యప్రాంతంలోనే తిరుగాడుతుందన్నది ప్రజల నమ్మిక. రవితేజ పాత్రకూడా అంతే. తన నీడకి కూడా పట్టు చిక్కని ప్రయాణం అతనిది. అటువంటి వాడి కోసం ఓ బ్యాచ్ పని కట్టుకొని అన్వేషణలో పడుతుంది.

కికారణ్యాలలో సంచరించే ఈగిల్(రవితేజ)ని పట్టుకోవాలంటే కొండమీద లావాని ఒంటి మీదకి తెచ్చుకున్నట్టేనన్నది సినిమాకి ట్యాగ్ లైన్ అనుకోండి దాదాపుగా. ఇటువంటి ఎక్స్ ప్లోజివ్ క్యారెక్టర్స్ రవితేజకి వెన్నతో పెట్టిన విద్య.  ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ తో రవితేజ  చెలరేగిపోయాడని అంటున్నారు. కానీ ఇక్కడే చిక్కంతా. ఓ క్యారెక్టర్ కోసం మాస్ మహరాజ్ చేసుకునే ప్రిపరేషన్ ఆషామాషీగా ఉండదు. షూటింగ్లో ఆ ఎఫర్ట్ కూడా మామ్మూలుగా ఉండదు. కానీ ఇవన్నీ కల్సొచ్చి, క్యారెక్టర్ తద్వారా సినిమా పండితే పండగే. పైగా పండక్కి వస్తోంది కాబట్టి రవితేజ అభిమానులకు డబుల్ ధమాకా దక్కుతుంది. కానీ ఏ మాత్రం తేడా వచ్చిందా అది మరో విధ్వంసం. ట్రేడ్ వర్గీయులు దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. టీజర్ లో పెద్దగా చెప్పింది లేదు. అంతా రవితేజ పొటన్షియల్ మీదనే ఆశలన్నీ అంటున్నారు అభిమానులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి