iDreamPost

Travis Head: ప్రత్యర్థి జట్లకు ట్రావిస్ హెడ్​ మాస్ వార్నింగ్! SRH అంటార్రా బాబు!

  • Published Apr 16, 2024 | 7:31 PMUpdated Apr 16, 2024 | 7:31 PM

సన్​రైజర్స్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి హెచ్చరిక గురించి తెలిస్తే ఇది కదరా ఎస్​ఆర్​హెచ్ దమ్ము అని చెప్పక తప్పదు.

సన్​రైజర్స్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి హెచ్చరిక గురించి తెలిస్తే ఇది కదరా ఎస్​ఆర్​హెచ్ దమ్ము అని చెప్పక తప్పదు.

  • Published Apr 16, 2024 | 7:31 PMUpdated Apr 16, 2024 | 7:31 PM
Travis Head: ప్రత్యర్థి జట్లకు ట్రావిస్ హెడ్​ మాస్ వార్నింగ్! SRH అంటార్రా బాబు!

సన్​రైజర్స్ హైదరాబాద్ అందర్నీ భయపెడుతోంది. భారీ స్కోర్లు బాదుతూ అపోజిషన్ టీమ్స్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస గెలుపులతో ఫుల్ జోష్​లో ఉన్న కమిన్స్ సేన.. నిన్న ఆర్సీబీని కూడా ఓడించింది. బెంగళూరుపై మ్యాచ్​లో ఏకంగా 287 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇదే సీజన్​లో ముంబై ఇండియన్స్ పై బాదిన 277 పరుగుల తన హయ్యెస్ట్ స్కోర్ రికార్డును నిన్నటి మ్యాచ్​తో చెరిపేసింది. ఈ సీజన్​లో ఆర్సీబీ, ముంబైతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్​ను చెన్నై సూపర్ కింగ్స్​ను కూడా చిత్తు చేసింది ఆరెంజ్ ఆర్మీ. ఆ జట్టు ఊపు చూస్తుంటే టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కాగా కనిపిస్తోంది. టీమ్ సక్సెస్​లో బ్యాటింగ్ యూనిట్​దే కీలకపాత్ర. అందులోనూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాలతో అదరగొడుతున్నాడు. అలాంటోడు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు.

సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నెక్స్ట్ లెవల్ ఫామ్​లో ఉన్నాడు. ఆడిన 5 మ్యాచుల్లో 199 స్ట్రయిక్ రేట్​తో 235 పరుగులు చేశాడు. దొరికిన బాల్​ను దొరికినట్లు బాదడమే పనిగా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను అతడు ఊచకోత కోస్తున్నాడు. నిన్న ఆర్సీబీతో మ్యాచ్​లోనూ విధ్వంసక ఇన్నింగ్స్​తో మెరిశాడు హెడ్. 41 బంతుల్లో 102 పరుగులతో రికార్డ్ స్కోర్​కు బాటలు వేశాడు. అలాంటోడు మ్యాచ్ ముగిసిన తర్వాత అపోజిషన్ టీమ్స్​కు వార్నింగ్ ఇచ్చాడు. తనతో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడేందుకు ఫ్రీడమ్ ఇచ్చిన కెప్టెన్ కమిన్స్​కు అతడు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే కోచ్ డానియల్ వెటోరికి కూడా క్రెడిట్ ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ జరిగే మ్యాచుల్లో ఎలా ఆడనున్నాడో చెప్పాడు.

‘నాతో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మను అటాకింగ్ మోడ్​లో ఆడేందుకు కమిన్స్, వెటోరి స్వేచ్ఛ కల్పించారు. ఇప్పుడు మా ముందున్న టార్గెట్ 300 పరుగులు. మిడిలార్డర్​లో హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డితో కూడిన పవర్ హిట్టింగ్ యూనిట్ ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని అందుకుంటాం’ అంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు హెడ్. ఇది చూసిన నెటిజన్స్.. ఎస్​ఆర్​హెచ్​ను తక్కువ అంచనా వేయొద్దని, ఇది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఇరవై రోజుల గ్యాప్​లో 270 ప్లస్ స్కోర్లు రెండుసార్లు బాదిన టీమ్.. 300 కొట్టడం ఏమంత కష్టం కాదని చెబుతున్నారు. ఎస్​ఆర్​హెచ్​ అంటార్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆరెంజ్ ఆర్మీ కొత్త టార్గెట్ రీచ్ అవుతుందని భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి