iDreamPost

SRH vs MI: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్ బాస్!

  • Published Mar 27, 2024 | 8:13 PMUpdated Mar 27, 2024 | 8:25 PM

సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్​తో అలరించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.

సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్​తో అలరించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.

  • Published Mar 27, 2024 | 8:13 PMUpdated Mar 27, 2024 | 8:25 PM
SRH vs MI: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్ బాస్!

ఫస్ట్ మ్యాచ్​లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయిన సన్​రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్​లో అదరగొడుతోంది. ఈ సీజన్​లో బోణీ కొట్టాలనే కసి మీద ఉన్న ఆ టీమ్ ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో చెలరేగిపోతోంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఎస్​ఆర్​హెచ్​కు మెరుపు ఆరంభం లభించింది. మయాంక్ అగర్వాల్ (11) త్వరగానే ఔట్ అయినా.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్​ ఆడాడు. 24 బంతుల్లో 62 పరుగులు చేశాడతను. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. తద్వారా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో ముంబై బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.

నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్​తో ముంబై బౌలర్లకు ఓ రేంజ్​లో పోయించాడు హెడ్. జస్​ప్రీత్ బుమ్రాను తప్పితే మిగతా బౌలర్లు అందరితోనూ ఆడుకున్నాడు. కొత్త కుర్రాడు క్వెనా మఫాకా బౌలింగ్​లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్​లో 9 బౌండరీలు బాదిన హెడ్.. 3 భారీ సిక్సులు కొట్టాడు. అతడికి అభిషేక్ శర్మ (44 నాటౌట్) మంచి సపోర్ట్ అందించాడు. వీళ్లిద్దరి జోరును తట్టుకోలేక ముంబై బౌలర్లు బేజారైపోయారు. అయితే ఎట్టకేలకు హెడ్​ను గెరాల్డ్ కొయెట్జీ ఔట్ చేశాడు. మరి.. హెడ్ ఊచకోత మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి