iDreamPost

SRH vs CSK: వీడియో: సిక్స్​తో మ్యాచ్ ఫినిష్.. తెలుగోడి తడాఖా చూపించాడు!

  • Published Apr 06, 2024 | 8:03 AMUpdated Apr 06, 2024 | 9:01 AM

డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్ కింగ్స్​ను సన్​రైజర్స్​ హైదరాబాద్ అలవోకగా ఓడించింది. మన టీమ్ బౌలింగ్, బ్యాటింగ్ బలం ముందు రుతురాజ్ సేన నిలవలేకపోయింది.

డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్ కింగ్స్​ను సన్​రైజర్స్​ హైదరాబాద్ అలవోకగా ఓడించింది. మన టీమ్ బౌలింగ్, బ్యాటింగ్ బలం ముందు రుతురాజ్ సేన నిలవలేకపోయింది.

  • Published Apr 06, 2024 | 8:03 AMUpdated Apr 06, 2024 | 9:01 AM
SRH vs CSK: వీడియో: సిక్స్​తో మ్యాచ్ ఫినిష్.. తెలుగోడి తడాఖా చూపించాడు!

సన్​రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​ అనగానే ఎస్​ఆర్​హెచ్​ అభిమానులు టెన్షన్ పడ్డారు. సీఎస్​కేను మన టీమ్ నిలువరించగలదా అని సందేహించారు. కానీ గత సీజన్ల కంటే ఎంతో డిఫరెంట్​గా కనిపిస్తున్న సన్​రైజర్స్.. రుతురాజ్ సేన మీద ఈజీగా నెగ్గింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన ఎస్ఆర్​హెచ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే సన్​రైజర్స్ ఇన్నింగ్స్​లో ఆఖర్లో వచ్చి ధనాధన్ షాట్లతో హైలైట్ అయ్యాడు ఓ తెలుగు ప్లేయర్. అతడే నితీష్ కుమార్ రెడ్డి.

షాబాజ్ అహ్మద్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి విన్నింగ్ షాట్​తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. 8 బంతులు ఎదుర్కొన్న ఈ తెలుగోడు 14 పరుగులు చేశాడు. అందులో ఒక బౌండరీ, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ రెండు షాట్లు కూడా సూపర్బ్ అనే చెప్పాలి. తొలుత రవీంద్ర జడేజా బౌలింగ్​లో ఏమాత్రం బెరుకు లేకుండా రివర్స్ స్వీప్ ఆడాడు నితీష్. అది ఫీల్డర్లను ఛేదించుకొని బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత విజయానికి ఇంకో 6 పరుగులు అవసరం ఉందనగా.. దీపక్ చాహర్ బౌలింగ్​లో సిక్స్ బాదాడు నితీష్. ఇలా ఆఖర్లో వచ్చి బిగ్ షాట్స్​తో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. తక్కువ గ్యాప్​లో ఎయిడెన్ మార్క్రమ్, షాబాజ్​ను ఔట్ చేసిన సీఎస్​కే.. మరో రెండు వికెట్లు తీసి మ్యాచ్​పై మరింత పట్టు బిగించాలని భావించింది.

Nitish Reddy

నితీష్ చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. రావడం రావడమే జడేజా బౌలింగ్​లో రివర్స్ స్వీప్ కొట్టి తన ఉద్దేశం బాదుడేనని క్లియర్​గా చెప్పేశాడు. విన్నింగ్ షాట్​గా భారీ సిక్స్ కొట్టేసరికి సన్​రైజర్స్ డగౌట్​లోని ప్లేయర్లు పరిగెత్తుకుంటూ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. స్టేడియంలోని ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్​హెచ్ విజయంతో సంతోషంలో మునిగిపోయారు. ఇక, ఒకే ఇన్నింగ్స్​తో మంచి క్రేజ్ సంపాదించిన నితీష్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన నితీష్ ఆంధ్ర జట్టు తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. రంజీలతో పాటు విజయ్ మర్చంట్ ట్రోఫీలో దుమ్మురేపడంతో అతడ్ని టీమ్​లోకి తీసుకుంది ఎస్​ఆర్​హెచ్. ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కు సొంతం చేసుకుంది. కాగా, 17 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన నితీష్.. 566 పరుగులు చేశాడు. ఆల్​రౌండర్ అయిన అతడు 52 వికెట్లు పడగొట్టాడు. మరి.. నితీష్​ రెడ్డి ఆటతీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: వీడియో: వరుస ఓటములు.. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాండ్యా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి