iDreamPost

హర్షల్ పటేల్​ను తుక్కు రేగ్గొట్టిన అభిషేక్ పోరెల్! అచ్చం యువరాజ్​లా..!

  • Published Mar 23, 2024 | 5:58 PMUpdated Mar 23, 2024 | 6:18 PM

ఢిల్లీ క్యాపిటల్స్​కు ఓ సూపర్బ్ ప్లేయర్ దొరికాడు. పంజాబ్​తో మ్యాచ్​లో ఆ టీమ్ పనైపోయిందనుకున్న తరుణంలో ఓ యంగ్ బ్యాటర్ చెలరేగిపోయాడు. అచ్చం లెజెండ్ యువరాజ్​లా ఆడుతూ ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్​కు ఓ సూపర్బ్ ప్లేయర్ దొరికాడు. పంజాబ్​తో మ్యాచ్​లో ఆ టీమ్ పనైపోయిందనుకున్న తరుణంలో ఓ యంగ్ బ్యాటర్ చెలరేగిపోయాడు. అచ్చం లెజెండ్ యువరాజ్​లా ఆడుతూ ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.

  • Published Mar 23, 2024 | 5:58 PMUpdated Mar 23, 2024 | 6:18 PM
హర్షల్ పటేల్​ను తుక్కు రేగ్గొట్టిన అభిషేక్ పోరెల్! అచ్చం యువరాజ్​లా..!

ఐపీఎల్-2024 సీజన్ రెండో మ్యాచ్​ ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో తొలుత డీసీ బ్యాటింగ్​కు దిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) ఆ టీమ్​కు మంచి స్టార్ట్ అందించారు. కానీ ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. 454 రోజుల తర్వాత క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 138 పరుగులకు 7 వికెట్లు పడ్డాయి. దీంతో డీసీ 150 పరుగులు చేసినా గొప్పే అని అంతా అనుకున్నారు. కానీ ఈ తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన అభిషేక్ పోరెల్ అదరగొట్టాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తూ రెచ్చిపోయాడీ యంగ్ క్రికెటర్. అచ్చం లెజెండ్ యువరాజ్ సింగ్​ మాదిరిగా షాట్లు కొడుతూ ఆకట్టుకున్నాడు.

పంజాబ్​తో మ్యాచ్​లో కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పోరెల్.. 32 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. చివరి ఓవర్​ వేసేందుకు వచ్చిన పేసర్ హర్షల్ పటేల్​ తుక్కు రేగ్గొట్టాడు పోరెల్. ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగిన ఈ యంగ్ బ్యాటర్ దెబ్బకు ఆఖరి ఓవర్​లో హర్షల్ ఏకంగా 25 పరుగులు ఇచ్చుకున్నాడు. మొదటి బాల్​కు ఫోర్ బాదిన పోరెల్.. రెండో బంతిని స్టాండ్స్​లోకి సిక్స్​గా తరలించాడు. ఆ తర్వాత రెండు బంతుల్ని బౌండరీలుగా మార్చాడు. ఐదో బంతిని మళ్టీ స్టేడియంలోని ఆడియెన్స్ దగ్గరకు పంపించాడు. ఆఖరి బంతికి ఒక రన్ తీశాడు.

JR UV Destruction

సీనియర్ పేసర్ అయిన హర్షల్​కు పగటిపూటే చుక్కలు చూపించాడు 21 ఏళ్ల పోరెల్. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఈ కుర్రాడు.. యువరాజ్ మాదిరిగా బాల్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో భారీ షాట్లు బాదేశాడు. అతడి దెబ్బకు డీసీ 20 ఓవర్లలో 174 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పంజాబ్ ఇప్పుడు 3.3 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 42 పరుగులతో ఉంది. బెయిర్​స్టో (9 నాటౌట్), ప్రభుసిమ్రన్ సింగ్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇక, బౌండరీలు, సిక్సులతో చెలరేగిన పోరెల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. మరో యువీ దొరికాడని.. అతడ్ని సరిగ్గా సానబెడితే భారత జట్టుకు పనికొస్తాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

ఎవరీ పోరెల్?

ఐపీఎల్​లో ఒక్క ఇన్నింగ్స్​తో లైమ్​ లైట్​లోకి వచ్చాడు అభిషేక్ పోరెల్. దీంతో అసలు ఎవరు ఇతను? బ్యాగ్రౌండ్ ఏంటి? అంటూ అందరూ వెతకసాగారు. వెస్ట్ బెంగాల్​కు చెందిన పోరెల్.. 2002, అక్టోబర్ 17న జన్మించాడు. బ్యాటర్​ మాత్రమే కాదు.. అతడు మంచి వికెట్ కీపర్ కూడా కావడం విశేషం. రంజీల్లో బెంగాల్ తరఫున కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడటంతో ఐపీఎల్​ ఛాన్స్ దక్కించుకున్నాడీ యంగ్ క్రికెటర్. గతేడాది నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్​తో అతడు జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు. వేలంలో ఇతడ్ని రూ.20 లక్షలకు దక్కించుకుంది డీసీ. పోరెల్​కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. అతడి సోదరుడు ఇషాన్ పోరెల్ భారత అండర్ 19 టీమ్​లో ఆడాడు. మరి.. పోరెల్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి