iDreamPost

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ –  సైన్స్ చెప్తున్న ఆసక్తికర విషయాలు 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ –  సైన్స్ చెప్తున్న ఆసక్తికర విషయాలు 

నేటి ఆధునిక ప్రపంచంలో బరువు తగ్గాలంటే బోలెడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరి ఆలోచన తీరు ప్రకారం వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకొని ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.

మన సంస్కృతిలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాదాపుగా అలాంటి ప్రక్రియే ఈ ఫాస్టింగ్. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మరింత బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 3 విధాలుగా ఉంటుంది.

మొదటి పద్ధతి ప్రకారం – ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఉపవాసం ఉండటం. అంటే రోజు విడిచి రోజు ఉపవాసం. ఈ ప్రక్రియను అనుసరించే వాళ్ళు ఉపవాస రోజున 500 కేలరీలకు మించి ఆహారాన్ని తీసుకోరు. మరుసటి రోజున వారికి నచ్చిన ఆహారాన్ని ఎటువంటి పరిమితులు లేకుండా తీసుకోవచ్చు.

రెండో పద్ధతిలో – 5:2 విధానాన్ని అనుసరిస్తారు. ఈ తరహా ఉపవాసంలోవారానికి 5 రోజులు విందు, మరో రెండు రోజులు ఉపవాసం ఉంటారు.

ఇక మూడో పద్ధతిలో – రోజుకు 16-20 గంటలు ఉపవాసం ఉంటారు. మిగిలిన 4-8 గంటల వ్యవధిలో వారికి నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తారు.

అయితే, మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను సరైన రీతిలో అనుసరించకపోయినా, ఆపేసినా, మీరు తిరిగి బరువు పెరుగే అవకాశం ఉంది. పార్టీలు, కుటుంబ వేడుకల వంటి సమయాల్లో చాలాసార్లు డైట్ ను ఫాలో అవ్వరు. అటువంటి సమయంలో మీరు తిరిగి బరువు పెరిగుతారు.

అందుకే మనం ఎటువంటి డైట్ ను అనుసరించినా, అనుసరించకపోయినా.. శరీరానికి తగినంత వ్యాయామం మాత్రం తప్పనిసరిగా ఉండాలని చెప్తారు వైద్యులు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగడం, బరువుతో వచ్చే సమస్యలను అధిగమించడం సులభమవుతుంది. పైగా శరీరం పూర్తిగా మన అదుపులో ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి