iDreamPost

VIDEO: గ్రౌండ్​లో కింగ్ కోహ్లీ నోట కింగ్ ఖాన్ పాట.. అనిరుధ్​ ఫ్యాన్ అయిపోయాడా?

  • Author singhj Published - 03:16 PM, Mon - 6 November 23

గ్రౌండ్​లో ఎంతో ఉత్సాహంగా ఉండే విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో మరోమారు తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ సినిమాలోని ఓ పాటను మైదానంలో పాడుతూ కనిపించాడు కింగ్ కోహ్లీ.

గ్రౌండ్​లో ఎంతో ఉత్సాహంగా ఉండే విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో మరోమారు తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ సినిమాలోని ఓ పాటను మైదానంలో పాడుతూ కనిపించాడు కింగ్ కోహ్లీ.

  • Author singhj Published - 03:16 PM, Mon - 6 November 23
VIDEO: గ్రౌండ్​లో కింగ్ కోహ్లీ నోట కింగ్ ఖాన్ పాట.. అనిరుధ్​ ఫ్యాన్ అయిపోయాడా?

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటేనే క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోతారు. ఎందుకుంటే అంతలా జెంటిల్మన్ గేమ్​పై అతడు ముద్ర వేశాడు. ఇంకా క్రికెట్​ మీద తన ప్రభావం చూపిస్తున్నాడు కింగ్ కోహ్లీ. గ్రౌండ్​లోకి దిగాడంటే చాలు.. ఏదో ఒక విధంగా ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తూనే ఉంటాడతను. బ్యాట్​తో పరుగుల వర్షం కురిపించే కోహ్లీ.. ఆ టైమ్​లోనూ ప్రత్యర్థి టీమ్ బౌలర్లను టీజ్ చేస్తుంటాడు. ఓవర్ల మధ్య గ్యాప్​లో అపోజిషన్ టీమ్ బౌలర్లు, ఫీల్డర్లతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మొన్న శ్రీలంకతో మ్యాచ్​లోనైతే రన్ తీసే క్రమంలో లంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్​తో బ్యాట్​తో సరదాగా కొట్టాడు కోహ్లీ. దీంతో మాథ్యూస్ నవ్వాపుకోలేకపోయాడు.

ఇక ఫీల్డింగ్​ టైమ్​లో ఫుల్ జోష్​లో ఉంటాడు కోహ్లీ. వికెట్ తీసిన బౌలర్ల కంటే అతనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాడు. గాల్లోకి ఎగిరి పంచ్​లు కొడుతూ, ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తుంటాడు. ఫీల్డింగ్ చేస్తూనే తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. అలాగే పాటలు పాడుతూ, డీజే ప్లే చేసే సాంగ్స్​కు స్టెప్స్ వేస్తూ ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తుంటాడు విరాట్. కొన్ని బాలీవుడ్ పాటలకు అతడు డ్యాన్స్ చేసిన వీడియోస్ నెట్టింట వైరల్​గా మారాయి. ఈ వరల్డ్ కప్​లోనూ ప్రతి మ్యాచ్​లో గ్రౌండ్​లో డ్యాన్స్ చేస్తూ ఫుల్ జోష్​తో కనిపిస్తున్నాడు కోహ్లీ. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో కూడా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు కోహ్లీ.

షారుఖ్ ఖాన్ రీసెంట్ హిట్ ‘జవాన్’ మూవీలోని ‘ఛలేయా’ సాంగ్​ను గ్రౌండ్​లో పాడుతూ స్టెప్ వేస్తూ కనిపించాడు కోహ్లీ. డీజే ప్లే చేయగానే విరాట్ కూడా ఈ పాటను హమ్ చేస్తూ షారుఖ్​ స్టెప్​ను ఇమిటేట్ చేశాడు. కోహ్లీ పాడుతున్న వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లీ షారుఖ్​తో పాటు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాటలకు ఫ్యాన్ అయిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. సరదాగా పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా అంతే సీరియస్​గా కోహ్లీ ఫీల్డింగ్ చేస్తాడని.. కెప్టెన్, బౌలర్లతో మాట్లాడుతూ, వారికి సలహాలు ఇస్తూ గేమ్​లో బాగా ఇన్​వాల్వ్ అవుతాడని.. అదే కింగ్ స్పెషాలిటీ అని మెచ్చుకుంటున్నారు. మరి.. గ్రౌండ్​లో కోహ్లీ పాట పాడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి కీలక నిర్ణయం! ఎందుకంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి