iDreamPost

T20 World Cup 2024 షెడ్యూల్ రిలీజ్.. పాకిస్థాన్​తో మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఏ రోజున జరగనుందో కూడా క్లారిటీ వచ్చేసింది. వరల్డ్ కప్ టోటల్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఏ రోజున జరగనుందో కూడా క్లారిటీ వచ్చేసింది. వరల్డ్ కప్ టోటల్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2024 షెడ్యూల్ రిలీజ్.. పాకిస్థాన్​తో మ్యాచ్ ఎప్పుడంటే..?

ప్రపంచ క్రికెట్ లో ఎన్ని మ్యాచ్ లు చూసినా రాని ఆనందం.. ఒక్క ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇరుదేశాల ప్రేక్షకులే కాక, దాయాదుల పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక 2024 జూన్ లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే జట్లు తమ ప్రణాళికలను మెుదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పొట్టి ఫార్మాట్ కు సంబంధించి మ్యాచ్ ల షెడ్యూల్, వేదికలు మిగిలిన వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఇండియా-పాక్ పోరు ఎప్పుడు ఉంటుందో కూడా క్లారిటీ వచ్చేసింది.

టీ20 వరల్డ్ కప్-2024 జూన్ నెలలో మొదలు కానుంది. ఆ నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గ్రూప్ మ్యాచులు జరుగుతాయి. జూన్ 19 నుంచి 24వ తేదీ వరకు సూపర్-8 మ్యాచుల్ని నిర్వహిస్తారు. అదే నెల 26, 27 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్​లు ఉంటాయి. జూన్ 29వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్​తో ప్రపంచ కప్ విజేత ఎవరో తేలిపోతుంది. ఈ మెగా టోర్నీలోని ఫస్ట్ మ్యాచ్​ యూఎస్​ వర్సెస్ కెనడా జట్ల మధ్య ఒకటో తేదీన జరగనుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీన న్యూయార్క్​లో జరగనుంది. టీమిండియా షెడ్యూల్​ను చూసుకుంటే.. జూన్ 5న ఐర్లాండ్​తో, 9న పాక్​తో, 12న యూఎస్​ఏతో తలపడనుంది. ఈ మూడు మ్యాచులు న్యూయార్క్​లోనే జరుగుతాయి. భారత్ తన ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లో 15వ తేదీన కెనడాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్​కు ఫ్లోరిడా ఆతిథ్యం ఇవ్వనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024లో మెుత్తం జట్లను నాలుగు గ్రూప్ లుగా విభజించారు. అందులో భాగంగా గ్రూప్-ఏలో ఇండియా, పాక్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ దేశాలు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, ఆసీస్, నమీబియా, స్కాట్లాండ్, ఓమన్. గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్గానిస్తాన్, ఉగాండ, పుపువా న్యూగినియా, గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మెగాటోర్నీలో గ్రూప్ స్టేజీ మ్యాచ్ లన్నీ యూఎస్ఏలో.. సూపర్ 8 మ్యాచ్ లు వెస్టిండీస్ లో జరుగుతాయి. మరి ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి