iDreamPost

Asia Cup: పాక్‌తో మ్యాచ్‌! ప్లేయింగ్‌ 11లోకి రాహుల్‌ను తీసుకుంటారా?

  • Published Sep 10, 2023 | 1:24 PMUpdated Sep 10, 2023 | 2:41 PM
  • Published Sep 10, 2023 | 1:24 PMUpdated Sep 10, 2023 | 2:41 PM
Asia Cup: పాక్‌తో మ్యాచ్‌! ప్లేయింగ్‌ 11లోకి రాహుల్‌ను తీసుకుంటారా?

ఆసియా కప్‌లో భాగంగా ఇండియా-పాకిస్థాన్‌ మధ్య నేడు(ఆదివారం) హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. సూపర్‌ 4 దశలో శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ దాయాదుల పోరు సాగునుంది. ఇప్పటికే లీగ్‌ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలోనే రద్దయిపోయిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, చాలా కాలం తర్వాత జరిగిన మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా నిరాశచెందారు.

అయితే.. ఈ రోజు జరిగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని సమాచారం. ఈ విషయంపై క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. భారత్‌-పాక్‌ మధ్య వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు జరిగే మ్యాచ్‌ కావడంతో.. మరింత ఆసక్తి నెలకొంది. లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పేసర్లు భారత టాపార్డర్‌పై పైచేయి సాధించారు. మరి ఈ మ్యాచ్‌లో పాక్‌ పేసర్లపై టీమిండియా టాపార్డర్‌ బదులుతీర్చుకోవాలనే కసితో ఉంది. మరి పాకిస్థాన్‌పై ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో అనే ఇంట్రెస్ట్‌ అందరిలో ఉంది.

ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌తోనే భారత్‌.. పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్టులో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తుంది. జరిగితే ఒక మార్పు జరగొచ్చని.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ లేక.. లీగ్‌ దశలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన రాహుల్‌.. తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. వరల్డ్‌ కప్‌కి ముందు అతనికి గేమ్‌ టైమ్‌ ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తుండటంతో అయ్యర్‌కు రెస్ట్‌ ఇచ్చి రాహుల్‌ను ఆడిస్తారేమో చూడాలి. మరి కిందున్న ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా) చూసి.. టీమిండియా గెలుపోటముల అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దుల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఇదీ చదవండి: IND vs PAK: టీమిండియాకు షాహిన్ అఫ్రిది వార్నింగ్! ఇది ఆరంభం మాత్రమే అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి