iDreamPost

VIDEO: రింకూ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. త్రిపాఠీ లేకుంటే అయ్యేది కాదు!

  • Author singhj Published - 06:01 PM, Tue - 3 October 23
  • Author singhj Published - 06:01 PM, Tue - 3 October 23
VIDEO: రింకూ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. త్రిపాఠీ లేకుంటే అయ్యేది కాదు!

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్​కు దూసుకెళ్లింది. పొరుగు దేశం నేపాల్​తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 202/4 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (100) సెంచరీ సాధించాడు. జైస్వాల్​తో పాటు శివమ్ దూబె (25 నాటౌట్), రింకూ సింగ్ (37 నాటౌట్) చెలరేగిపోయారు. రింకూ అయితే నాలుగు సిక్సులు బాది టీమ్ స్కోరును 200 దాటించాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్రకు రెండు వికెట్లు దక్కాయి. సోంపాల్, లామిచానె చెరో వికెట్ తీశారు. భారీ స్కోరును ఛేజింగ్​ చేయడానికి దిగిన నేపాల్ ఓవర్లన్నీ పూర్తయ్యే సరికి 179/9 స్కోరుకు పరిమితమైంది.

నేపాల్ దూకుడుగానే ఆడినా గెలుపునకు 23 పరుగుల దూరంలో ఉండిపోయింది. దీపేంద్ర సింగ్ ఐరీ (32) నేపాల్ టీమ్​లో హయ్యెస్ట్‌ స్కోరర్. అతడు హ్యాట్రిక్ సిక్సులు బాదడం విశేషం. దీపేంద్రతో పాటు సందీప్ జొరా (29), కుశాల్ మల్లా (29), కుశాల్ భుర్టెల్ (28) రాణించారు. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ ఖాన్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. అర్ష్​దీప్ సింగ్, సాయి కిశోర్​లకు తలో వికెట్ దక్కింది. గ్రౌండ్ చిన్నదవడంతో ఈ మ్యాచ్​లో పరుగుల మోత తప్పదని ఫ్యాన్స్ ముందే అంచనా వేశారు. అందుకు తగ్గట్లే ఇరు జట్లలోని బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో అదరగొట్టారు. దీంతో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టమైపోయింది.

ఈ మ్యాచ్​లో రింకూ సింగ్ పట్టిన ఒక క్యాచ్​ హైలైట్ అని చెప్పాలి. నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా స్ట్రయిట్ బౌండరీని టార్గెట్ చేసుకొని కొట్టిన బాల్ సిక్స్ వెళ్లేలా కనిపించింది. కానీ దీన్ని అందుకునేందుకు ఆఫ్ సైడ్ నుంచి రింకూ.. ఆన్ సైడ్ నుంచి రాహుల్ త్రిపాఠీ పరిగెత్తుకుంటూ వచ్చారు. బౌండరీ లైన్​ మీదుగా ఎగిరి బంతిని పట్టుకున్న త్రిపాఠీ.. ఫోర్ లైన్ దాటానని గ్రహించాడు. అందుకే కింద ల్యాండ్ అయ్యే లోపే బంతిని గ్రౌండ్ లోపలికి విసిరాడు. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న రింకూ ఆ బాల్​ను అందుకున్నాడు. దీంతో ఆడియెన్స్ సహా బ్యాటర్ కుశాల్ మల్లా కూడా షాక్ అయ్యాడు. ఈ క్యాచ్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. రింకూ సూపర్ క్యాచ్​పై మీ రియాక్షన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఉచితంగా చూసే ఛాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి