iDreamPost

World Cup: పాకిస్థాన్‌పై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Oct 14, 2023 | 9:51 PMUpdated Oct 14, 2023 | 9:51 PM
  • Published Oct 14, 2023 | 9:51 PMUpdated Oct 14, 2023 | 9:51 PM
World Cup: పాకిస్థాన్‌పై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వన్డే వరల్డ్‌ కప్స్‌లో పాక్‌పై విన్నింగ్‌ రేషియోను 8-0కు పెంచుకుంది భారత్‌. ఇంతవరకు వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో టీమిండియాపై పాకిస్థాన్‌ ఎప్పుడూ గెలవలేదు. అదే సంప్రదాయాన్ని టీమిండియా ఇప్పుడు కూడా కొనసాగించింది. అయితే.. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ ఇలా వన్‌సైడ్‌గా ముగిసిపోవడంపై క్రికెట్‌ అభిమానులు కాస్త నిరాశ చెందినా.. టీమిండియా అలాంటి సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో వన్‌సైడ్‌ తప్పలేదని అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి దోహదం చేసిన ఓ 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. సూపర్‌ బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవ్సాలింది టీమిండియా బౌలింగ్‌. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంత కంఫర్టబుల్‌గా గెలిచిందంటే.. అది బౌలింగ్‌ బలంతోనే. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా ఈ ఐదుగురు అద్భుతంగా రాణించారు. సిరాజ్‌ ఆరంభంలో కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్‌ అయినా కూడా.. తొలి వికెట్‌ అతనే అందించాడు. అలాగే హాఫ్‌ సెంచరీతో డేంజర్‌గా మారుతున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ను సూపర్‌ డెలవరీతో బౌల్డ్‌ చేసి.. పాక్‌ పతనాన్ని శాసించాడు. అలాగే బుమ్రా సైతం రెండో వికెట్ల తీయడంతో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి పాక్‌ను మెసలకుండా చేశాడు. ఇక కుల్డీప్‌ యాదవ్‌, పాండ్యా, జడేజా రెండేసి వికెట్లతో సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టాడు.

2. కెప్టెన్సీ
ఇక ఈ మ్యాచ్‌లో ఇంకో ప్రధాన విషయం ఏంటంటే.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ. బౌలర్లను అద్భుతంగా మారుస్తూ.. సరైన టైమ్‌లో సిరాజ్‌ను రెండో స్పెల్ కోసం తీసుకురావడం, బుమ్రాతో మంచి స్పెల్స్‌ వేయిండంలో రోహిత్‌ శర్మ అద్భుతంగా సక్సెస్‌ అయ్యాడు. ఫీల్డింగ్‌ సెట్‌ కూడా సూపర్‌గా చేశాడు. టీమిండియాకు ఆరుగురు ప్రధాన బౌలర్లు ఉన్నా.. వారిని సరైన టైమ్‌లో వాడుకుని, వారి నుంచి వికెట్లను తీయించడంలో రోహిత్‌ విజయం సాధించాడనే చెప్పాలి. ఈ విజయంలో రోహిత్‌ కెప్టెన్సీకి కూడా భాగం ఇవ్వాల్సిందే.

3. పిచ్‌ కండీషన్స్‌
అహ్మాదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని మొదటి నుంచి అంతా భావించారు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ఎవరైనా తొలుత బ్యాటింగ్‌ చేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ, పిచ్‌ కండీషన్స్‌ చూసిన తర్వాత రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. అది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. పాకిస్థాన్‌కు మంచి స్టార్ట్‌ లభించినా.. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగి.. పాకిస్థాన్‌ను 191 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో.. టీమిండియాకు టార్గెట్‌ చాలా ఈజీ అయిపోయింది.

4. రోహిత్‌ శర్మ హిట్టింగ్‌
పాకిస్థాన్‌ 191 పరుగులకే ఆలౌట్‌.. టీమిండియా ముందు 192 పరుగుల టార్గెట్‌ మాత్రమే ఉంచినా.. పాకిస్థాన్‌కు బలమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉంది. పైగా లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఇబ్బంది పడతారనే వాదన కూడా ఉండటంతో టీమిండియా ఈ టార్గెట్‌ను ఈజీగా తీసుకోలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా కాలంగా ఆడుతున్న స్టైల్‌లోనే బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. దీంతో.. గిల్‌, కోహ్లీ త్వరగానే అవుటైనా.. కూడా రోహిత్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో లక్ష్యం చిన్నబోయింది. స్టోగా ఆడి ఉంటే.. మరింత ఒత్తిడి పెరిగేది. అందుకే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంత ఏకపక్షం విజయం సాధించడంలో రోహిత్‌ పాత్ర కూడా ఉంది.

5. ఒత్తిడి
ప్రెషర్‌.. ఈ మ్యాచ్‌ అనే కాదు.. ఇండియా-పాకిస్థాన్‌ ఎప్పుడు తలపడినా ఇరు జట్లుపై ఎంత కాదన్న ఒత్తిడి ఉంటుంది. పైగా వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ అంటే ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఈ ఒత్తిడిని టీమిండియా బ్యాలెన్స్‌ చేస్తున్నంతగా పాకిస్థాన్‌ జట్టు చేయలేకపోతుంది. అందుకే మంచి స్టార్ట్‌ లభించిన తర్వాత.. కూడా మంచి స్కోర్‌ చేయలేకపోయింది. 155 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టస్థితిలో ఉన్న పాకిస్థాన్‌.. కేవలం 36 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయింది. పైగా పిచ్‌ బౌలర్లు అంతా ఏం అనుకూలించలేదు. కాస్త బేసిక్స్‌ను ఫాలో అయ్యారు టీమిండియా బౌలర్లు అంతే. పాక్‌ బ్యాటర్లు ఒత్తిడికి లోనై.. పెవిలియన్‌కు క్యూకట్టారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: పాండ్యాపై పాక్‌ జర్నలిస్ట్‌ ఆరోపణలు! చీటింగ్‌ అంటూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి