iDreamPost

బంగ్లాదేశ్ భారత్ కి షాకిస్తుందా?

బంగ్లాదేశ్ భారత్ కి షాకిస్తుందా?

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ అప్రతిహాతంగా సాగిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది.. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 47.2 ఓవర్లలో, 177 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన భారత బాట్స్మెన్ ఎవరూ రాణించలేదు.

యశస్వి జైస్వాల్ 88 పరుగులు సాధించగా, తిలక్ వర్మ 38 పరుగులు సాధించాడు.. వికెట్ కీపర్ ధృవ్ 22 పరుగులకే అవుట్ అవగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కె పరిమితమయ్యారు. మిడిల్ ఆర్డర్ తడబాటుతో 177 పరుగులకే భారత్ పరిమితమయ్యింది.. అవిషేక్ దాస్ 3 వికెట్లతో చెలరేగగా, షోరిఫుల్ ఇస్లాం,తంజీమ్ హాసన్ రెండేసి వికెట్లు తీయగా, రకీబుల్ హాసన్ ఒక వికెట్ సాధించాడు..

కట్టుదిట్టమైన బౌలింగ్ తో , ఫీల్డింగ్ తో భారత్ ని వణికించిన బం గ్లాదేశ్ బ్యాటింగ్ లో మొదటి ఓవర్ ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 13 సాధించింది.. భారత క్రికెట్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే ట్రోఫీని నిలబెట్టుకోగలుగుతుంది.. లేకుంటే ఫైనల్ లో పరాభవం చెందక తప్పదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి