iDreamPost

విరాట్ కోహ్లీ సెంచరీ.. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడానికి కారణం?

  • Author Soma Sekhar Updated - 03:02 PM, Fri - 20 October 23

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీకి దోహదపడ్డాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. రాహుల్ తో పాటుగా ఫీల్డ్ అంపైర్ సైతం విరాట్ శతకానికి తనవంతు సాయం చేశాడు. బంగ్లా బౌలర్ లెగ్ సైడ్ వైడ్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ గా ఉన్న రిచర్డ్ వైడ్ గా ప్రకటించలేదు.

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీకి దోహదపడ్డాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. రాహుల్ తో పాటుగా ఫీల్డ్ అంపైర్ సైతం విరాట్ శతకానికి తనవంతు సాయం చేశాడు. బంగ్లా బౌలర్ లెగ్ సైడ్ వైడ్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ గా ఉన్న రిచర్డ్ వైడ్ గా ప్రకటించలేదు.

  • Author Soma Sekhar Updated - 03:02 PM, Fri - 20 October 23
విరాట్ కోహ్లీ సెంచరీ.. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడానికి కారణం?

వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి కింగ్ విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ పాత్ర పోషిస్తూ 48వ వన్డే శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీకి దోహదపడ్డాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. అయితే రాహుల్ తో పాటుగా ఫీల్డ్ అంపైర్ సైతం విరాట్ శతకానికి తనవంతు సాయం చేశాడు. ఇండియా విజయానికి రెండు పరుగులు, కోహ్లీ సెంచరీకి మూడు పరుగులు అవసరం కాగా.. అదే సమయంలో బంగ్లా బౌలర్ లెగ్ సైడ్ వైడ్ వేశాడు. కానీ ఈ బంతిని ఫీల్డ్ అంపైర్ గా ఉన్న రిచర్డ్ వైడ్ గా ప్రకటించలేదు. మరి అతడు ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ కప్ లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఫుల్ స్వింగ్ లో ఉన్న భారత జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించి.. సెమీఫైనల్ కు మరింత దగ్గరైంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టును 7 వికెట్లతో ఓడించి.. వరల్డ్ కప్ లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంపైర్ వైడ్ టాపిక్. ఈ వైడ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. విరాట్ కోహ్లీ 74 రన్స్ తో క్రీజ్ లో ఉన్నప్పుడు టీమిండియా విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి.

అయితే ఆ తర్వాత రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడి కోహ్లీ సెంచరీకి సాయం చేశాడు. ఇదిలా ఉండగా.. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 97 పరుగులతో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులు కావాలి. ఈ క్రమంలో42వ ఓవర్ వేయడానికి వచ్చాడు నాసుమ్ అహ్మద్. తొలి బంతిని లెగ్ సైడ్ వేయగా అది కాస్త వైడ్ గా వెళ్లింది. దీంతో అంపైర్ వైడ్ ఇస్తాడా? అన్నట్లుగా కోహ్లీ రియాక్షన్ ఇచ్చాడు. కానీ విరాట్ కొద్దిగా లోపలికి జరిగాడని భావించిన ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ దానిని వైడ్ గా ప్రకటించలేదు. దీంతో అభిమానులతో పాటుగా కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఊరట చెందారు. ఆ తర్వాత మూడో బంతికే సిక్సర్ బాదిన విరాట్ మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వైడ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అంపైర్ రిచర్డ్ సైతం ట్రెండింగ్ లోకి వచ్చాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్, నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ తో పాటుగా విరాట్ సెంచరీలో భాగం అంపైర్ కు కూడా ఇవ్వాలని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే విరాట్ సెంచరీ కోసమే అతడు వైడ్ ఇవ్వలేదేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తుండగా.. విరాట్ కొద్దిగా ముందుకు జరిగినందుకే అంపైర్ వైడ్ ఇవ్వలేదని ఇంకొంతమంది క్రికెట్ అభిమానులు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి