iDreamPost

త్వరలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు!.. జాబితాలో మీరున్నారా?

కేంద్ర ప్రభుత్వ సంస్థ వారికి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నది. ఇంతకీ దేనికి సంబంధించిన డబ్బులు అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వ సంస్థ వారికి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నది. ఇంతకీ దేనికి సంబంధించిన డబ్బులు అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు మీకోసం..

త్వరలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు!.. జాబితాలో మీరున్నారా?

కేంద్ర ప్రభుత్వం వారికి శుభవార్తను అందించింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఇది సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు మాత్రం కాదు. మరి ఇంక ఏ పథకం కింద డబ్బులు జమ చేస్తుందని మీకు సందేహం కలగవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా వచ్చే డబ్బులు మాత్రం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో పనిచేస్తున్న ఆదాయ పన్ను శాఖ అందించే రిఫండ్ డబ్బులు. గతంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి రిఫండ్ డబ్బును అర్హులైన వారి అకౌంట్లల్లో జమ చేయనున్నది. మరి ఆ జాబితాలో మీరు ఉన్నారా? లేదా అనేది తెలియాలంటే.. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆదాయపు పన్ను శాఖ అపెక్స్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నేతృత్వంలో పని చేస్తుంది. దేశంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను వసూల్ చేస్తుంటుంది. వ్యక్తులు, సంస్థలు, ప్రాపర్టీలపై వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ను విధిస్తుంటుంది. రియాలిటీ షోలల్లో కూడా వచ్చే ఫ్రైజ్ మనీపై కూడా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం 2017- 18, 2018 -19, 2019- 20కి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి ఐటీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన ట్యాక్స్ పేయర్స్ కి రిఫండ్ డబ్బులు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులకు జనవరి 31, 2024 లోపు వారి ఖాతాల్లోకి రిఫండ్ డబ్బులు చెల్లించనున్నట్లు ఐటీ డిపార్ట్ మెంట్ తెలిపింది.

గతంలో ఆదాయ పన్ను చెల్లించిన వారి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ ను టైమ్ లిమిట్ కారణంగా ప్రాసెస్ చేయలేదు ఐటీ శాఖ. ఈ కారణంతో అలాంటి వారికి ఇప్పటి వరకు రిఫండ్ డబ్బులు అందలేదు. కాగా వాటికి సంబంధించిన ప్రాసెస్ పూర్తవడంతో పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ అందిస్తామని తెలిపింది. అయితే, మీకు ఐటీఆర్ కాలిక్యులేషన్ అనేది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం చెప్పిన ప్రకారం సరిపోలితేనే మీకు ట్యాక్స్ రిఫండ్ వస్తుందనేది గమనించాల్సిన విషయం. అలాగే మీ బ్యాంకు ఖాతాలో రిఫండ్ జమ చేసే ముందే మీకు సెక్షన్ 143(1) ప్రకారం మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి సమాచార నోటీసులు వస్తాయి. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దీనికి సంబంధించి డిసెంబర్ 1, 2023 రోజునే ఆదేశాలు జారీ చేసింది. మరి త్వరలో రిఫండ్ డబ్బులు జమ కానున్న వేళ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి