iDreamPost

తిప్ప‌తీగ‌ దివ్య ఔషధమే! కానీ.., ఈ విష‌యాలు తెలుసుకోకుంటే చాలా డేంజర్!

  • Published Nov 10, 2023 | 11:21 AMUpdated Nov 10, 2023 | 11:21 AM

ప్రకృతిలో లభించే ఎన్నో ఔషదాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వనమూలికలు, మొక్కలను వాడుతుంటారు. ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేద చికిత్సను నమ్ముకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.

ప్రకృతిలో లభించే ఎన్నో ఔషదాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వనమూలికలు, మొక్కలను వాడుతుంటారు. ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేద చికిత్సను నమ్ముకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.

  • Published Nov 10, 2023 | 11:21 AMUpdated Nov 10, 2023 | 11:21 AM
తిప్ప‌తీగ‌ దివ్య ఔషధమే! కానీ.., ఈ విష‌యాలు తెలుసుకోకుంటే చాలా డేంజర్!

ప్రకృతిలో ఎన్నో ఔషద మొక్కలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పూర్వం ఎలాంటి రోగాన్నైనా వనమూలికలతో ఇట్టే నయం చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రకృతిలో లభించే మూలికలతో వైద్యం చేస్తూ దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తున్న వైద్యులు. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో ఎన్నో వనమూలికలను ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగించేది మొక్క తిప్పతీగ. పట్టణాల్లో ఉండేవారికి దీనికి పెద్దగా తెలియకపోయి… గ్రామాల్లో ఉండేవారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. రోడ్డు పక్కన దిబ్బల్లో లభించే తీగ జాతికి చెందింది తిప్పతీగ. దీన్ని ఆంగ్లంలో గిలోయ్ అని., సంస్కృతంలో అమృత, గూడూచి, మధుపర్ణి, చిన్నోభవ, అమృతవల్లి అనే పేర్లతో పిలుస్తుంరు. ఈ మొక్క ఆకులు, పూలు, కాండం, వేళ్లు అన్ని ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తుంటారు. ఎన్నో దీర్ఘకాలిక రోగాలను ఈ మొక్క నయం చేస్తుంది. ఇటీవల తిప్పతీగా చూర్ణం మెడికల్ , ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఈ కాలంలో మనిషి వాడే ఆహార పదార్థలు, విష వాయుల వల్ల ఎన్నో రోగాల భారిన పడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకునేందుకు చాలా మంది ఆయుర్వేద చికిత్స వైపు మొగ్గు చూపిస్తుంటారు. ప్రకృతిలో లభించే దివ్య ఔషదాలతో ఎలాంటి రోగాలనైనా నయం చేయవొచ్చు. ఇది మన పూర్వీకులు ప్రసాదించిన వరం. ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా తిప్పతీగ వాడుతుంటారు. ఈ తిప్పతీగ మనకు ఎక్కువగా గ్రామాల్లో లభిస్తుంది. పట్టణాల్లో కూడా కొన్ని దిబ్బలపై తీగల్లా అల్లుకుని ఉంటుంది. దీని గురించి తెలియని వాళ్లు పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ ఇది అద్భుతమైన ఔషద మొక్క.  మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా.. రోజుకి రెండు తిప్ప ఆకులను నమిలితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్ప తీగ వల్ల కలిగే ప్రయోజాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో యాంటీ బయోటిక్, యాంటీ ఫంగస్, యాంటీ వైరల్ లాంటి గుణాలు శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, వృద్దాప్య ఛాయలను దూరం చేస్తాయి.

సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే విష జ్వరాలు అయిన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా, టైఫాడ్ లాంటి రోగాలను నివారిస్తుంది. డయాబెటీస్, విష జ్వరం, హైపటైటీస్, ఆస్తమా, గుండె సంబంధిత రోగాలను నయం చేస్తుంది. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది, దీంతో జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. జలుబు, టాన్సిల్స్, దగ్గు, శ్వాస కోస సమస్యలతో బాధపడే వారికి తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజూ వాడితే మంచి ఫలితం ఉంటుంది. తిప్పతీగతో కామెర్లు నయం చేయవొచ్చు. తిప్పతీగతో మూత్ర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఈ చూర్ణం వాడితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే తిప్పతీగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దుష్ప్రభావాలు ఉన్నాయి. శస్త్ర చికిత్స చేయించుకన్న వాళ్లు, గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు దీన్ని వాడితే ప్రమాదం అని అంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి