iDreamPost

మళ్లీ వర్షాలు.. వాతావరణ శాఖ నివేదిక

మళ్లీ వర్షాలు.. వాతావరణ శాఖ నివేదిక

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. తమిళనాడు తీరానికి సమీపంలోని, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం ఈ వర్షాలకు కారణంగా పేర్కొంది. అంతే కాకుండా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఇప్పుడు ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని వివరిస్తున్నారు.

వీటి ప్రభావం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తున్నాయంటున్నారు. కాగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు మూడు రోజుల పాటు కురుస్తాయని వివరిస్తున్నారు. దాదాపుగా రాష్ట్రమంతా ప్రస్తుతం మేఘావృతంగానే ఉంది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం తదితర చోట్ల చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి.

కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. వర్షాకాలం నుంచి శీతాకాలానికి రుతువు మార్పు నేపథ్యంలో కూడా వాతావరణంలో తరచు మార్పులు జరుగుతుంటాని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పుల కారణంగానే ఎండ తీవ్రతతో పాటు, రాత్రిపూట మంచు కూడా కురుస్తుందని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి