iDreamPost

ఇంటర్‌ పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. రూ.35,000 వరకూ జీతం

  • Published Apr 05, 2024 | 12:44 PMUpdated Apr 05, 2024 | 1:44 PM

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కోసమే ఈ వార్త. పూర్తి వివరాలు కోసం చదవండి

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కోసమే ఈ వార్త. పూర్తి వివరాలు కోసం చదవండి

  • Published Apr 05, 2024 | 12:44 PMUpdated Apr 05, 2024 | 1:44 PM
ఇంటర్‌ పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. రూ.35,000 వరకూ జీతం

నేటి కాలంలో ఉద్యోగం రావడం అంటే.. మాటలు కాదు. చదువు ఒక్కటే ఉంటే నేటి కాలంలో ఉద్యోగాలు రావు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి.. ఏళ్ల తరబడి చదవాలి. నిద్రాహారాలు మాని.. రోజుకు 18 గంటలు కష్టపడి చదివినా ఉద్యోగం వస్తుందా అంటే నమ్మకంగా చెప్పలేం. ఇక డిగ్రీ పూర్తి చేయకపోతే మరింత కష్టం. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్ పాసైన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం లభించింది. ఆ వివరాలు..

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం మీకోసం. న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు మే 22వ తేదీలోగా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇక్కడ ఇస్తున్నాం.. దీనిపై క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్య సమాచారం :

  • ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు: 1,074
  • అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
  • ఏజ్ లిమిట్: 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000గా నిర్ణయించారు.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు
  • తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
  • పరీక్ష ఫీజు: రూ.350గా నిర్ణయించారు.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి