iDreamPost

‘Shikaru’ movie షికారు రిపోర్ట్

‘Shikaru’ movie షికారు రిపోర్ట్

చిన్న సినిమాల మనుగడ కష్టమవుతున్న తరుణంలో ఏదైనా శుక్రవారం స్టార్ హీరోలు లేకపోతే చాలు బాక్సాఫీస్ వద్ద మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. వాటిలో భాగంగా నిన్న విడుదలైన మూవీనే షికారు. పెద్దగా హైప్ లేకపోయినా ప్రమోషన్ల విషయంలో యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పబ్లిసిటీ చేసింది. ఈ కారణంగానే 24న రావాల్సిన తమ చిత్రాన్ని వారం ఆలస్యంగా తీసుకొచ్చారు.అయినా కూడా పోటీ తప్పలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలిలో నటించి మెప్పించిన ధన్సిక కీలక పాత్ర పోషించడం ఇందులో ప్రధాన హైలైట్ గా ప్రమోట్ చేశారు. హరి కొలగాని దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ డ్రామా ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం పదండి.

నరసింహ(కిషోర్)ఒక పోలీస్ ఆఫీసర్. వయసులో తనకన్నా బాగా చిన్నదైన దీపిక(సాయి ధన్సిక)ని పెళ్లి చేసుకుని తనని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తుంటాడు. సున్నిత మనస్కురాలైన దీపిక భర్త నుంచి ఏం ఆశించినా లాభం లేదని గుర్తించి అతనికి చెప్పకుండా చదువుని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ టైంలో ఓ బ్యాచిలర్ యువకుడు బాబీ(అభినవ్) పరిచయమవుతాడు. ఊహించని విధంగా ఓ రోజు నరసింహ లేని టైంలో బాబీ ఆ ఇంట్లో ఇరుక్కుపోతాడు. తిరిగి వచ్చిన మొగుడికి అతను కనిపించకుండా చేసేందుకు స్నేహితులు రంగంలోకి దిగుతారు. మరి వీళ్ళ షికారు చివరికి ఏ మలుపు తీసుకుందో సినిమాలోనే చూడాలి.

హుషారులో క్యాస్టింగ్ బాగా కుదిరింది. లీడ్ పెయిర్ తో పాటు ధీరజ్ ఆత్రేయ లాంటి వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలయ్య రెఫరెన్స్ లను వాడుకున్న తీరు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయం. హరి కొలగాని యూత్ ని టార్గెట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బలంగా నచ్చే అంశాలు లేకుండా పోయాయి. ఓ మోస్తరు ఎంటర్ టైన్మెంట్ తో సర్దుకునే వాళ్ళను మెప్పిస్తుందేమో కానీ హాలుకు ఏవేవో అంచనాలతో వెళ్తే మాత్రం ఫైనల్ గా నిరాశ తప్పదు. టైటిల్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేయకపోతే ఏదో గడిచిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని థియేటర్ లోనే ఫీలవ్వాలా అంటే సమాధానం అవసరం లేదనే వస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి