iDreamPost

ఇషాన్‌ కిషన్‌ తల్లి మాటలు వింటే.. సెల్యూట్‌ చేస్తారు!

  • Author singhj Published - 10:12 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ త్లలి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఏమందంటే..!

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ త్లలి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఏమందంటే..!

  • Author singhj Published - 10:12 PM, Sat - 18 November 23
ఇషాన్‌ కిషన్‌ తల్లి మాటలు వింటే.. సెల్యూట్‌ చేస్తారు!

వన్డే వరల్డ్ కప్-2023లో ఆఖరి పోరుకు అంతా రెడీ అయిపోయింది. ఇంకో మ్యాచ్ ఆడితే మెగా టోర్నీ ముగిసిపోతుంది. తొలి సెమీస్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేసి భారత్.. రెండో నాకౌట్ మ్యాచ్​లో సౌతాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్​కు చేరుకున్నాయి. 2003 వరల్డ్ కప్ ఓటమికి ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియాతో పాటు అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. అయితే మరోమారు ఫైనల్​ ఫైట్​లో భారత్​కు షాకిచ్చి కప్పు ఎగరేసుకుపోవాలని ఆసీస్ భావిస్తోంది. దీంతో మెగా ఫైనల్ మరింత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇరు టీమ్స్ తగ్గేదేలే అనే రేంజ్​లో కొదమసింహాల్లా పోరాడటం ఖాయమని చెప్పొచ్చు.

ఫైనల్ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2011 తర్వాత తిరిగి ఈసారే ఫైనల్​కు చేరుకోవడంతో ఎలాగైనా కప్పును ఒడిసిపట్టాలని అనుకుంటున్నారు. కప్​ను గెలవడం, ఆసీస్​పై బదులు తీర్చుకోవడం రెండూ ఒకే మ్యాచ్​లో అయిపోవాలని అనుకుంటున్నారు. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మాదిరిగానే టైటిల్ ఫైట్​లోనూ తమ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. బౌలర్లు, బ్యాటర్లకు అవసరమైన టైమ్​లో సలహాలు, సూచనలు ఇస్తూ టీమ్​ను లీడ్ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. బ్యాటింగ్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ మిగతా బ్యాట్స్​మెన్​లో ఆడాలనే కసిని పెంచుతున్నాడు. ఇదే పెర్ఫార్మెన్స్​ను ఆసీస్​ మీదా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు హిట్​మ్యాన్. ప్లేయర్ల మీద ప్రెజర్ లేకుండా చూడాలని.. అవసరమైతే ఆ ఒత్తిడిని తాను తీసుకునేందుకు సిద్ధమంటున్నాడు.

టీమ్ బ్యాటింగ్ భారాన్ని మోసేందుకు తాను రెడీ అంటున్నాడు విరాట్ కోహ్లీ. రోహిత్ ఇచ్చిన స్టార్ట్​ను అందుకొని ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలని చూస్తున్నాడు. ఆఖరి వరకు అదే ఊపును కంటిన్యూ చేస్తూ మ్యాచ్ ఫినిష్​ చేయాలని అనుకుంటున్నాడు. ఓపెనింగ్​లో రోహిత్​కు శుబ్​మన్ గిల్ సహకరించినట్లే.. మిడిలార్డర్​లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కింగ్​కు సహకరిస్తే సరిపోతుంది. ఒకవేళ వికెట్లు త్వరగా పడితే లోయరార్డర్ హెల్ప్​తో జట్టును మంచి స్కోరు అందించే బాధ్యత రవీంద్ర జడేజా మీద ఉంటుంది. బౌలర్లు తలా ఓ చేయి వేస్తే అది ఈజీ అవుతుంది. ఇక, బౌలింగ్​లో షమి, బుమ్రా, జడేజా, సిరాజ్, కుల్​దీప్ ఎలాగూ ఉండనే ఉన్నారు.

టోర్నమెంట్ మొత్తం అదరగొడుతూ వచ్చిన భారత బౌలింగ్ యూనిట్ ఫైనల్లోనూ రాణిస్తే ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ వచ్చి మన ఒడిలో చేరుతుంది. ఇక, సెమీస్​లో ఆడిన టీమ్​నే ఫైనల్​లోనూ టీమిండియా కంటిన్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. బెంచ్​ మీద ఉన్న ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్​కు అవకాశం రాకపోవచ్చు. ఈ తరుణంలో ఇషాన్ తల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘వరల్డ్ కప్​లో గ్రౌండ్​లోకి ఇషాన్ వస్తూ పోతున్నాడు. అదే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఇండియా కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. నా కొడుకు ప్లేయింగ్ ఎలెవన్​లో ఉండాలని అనుకుంటున్నా. కానీ ఎవర్ని ఆడించాలి, ఎవరు బెస్ట్ అనేది టీమ్​ మేనేజ్​మెంట్​కు తెలుసు’ అని ఇషాన్ కిషన్ తల్లి చెప్పుకొచ్చారు. తన కొడుకు ఆడటం కంటే వరల్డ్ కప్ నెగ్గడమే ముఖ్యమని చెప్పడంతో అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. మీకు సెల్యూట్ మదర్ అంటున్నారు. మరి.. ఇషాన్ కిషన్ తల్లి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ 50 సెంచరీల రికార్డును బాబర్‌ బ్రేక్‌ చేస్తాడు! నవ్వకండి సీరియస్‌ మ్యాటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి