iDreamPost

పారిశుద్ద్య కార్మికారులిపై GHMC ఉద్యోగి లైంగిక వేధింపులు.. ప్రతి రోజూ గదిలోకి తీసుకెళ్లి..!

  • Published May 23, 2024 | 11:40 AMUpdated May 23, 2024 | 11:40 AM

Hyderabad: పదవిని అడ్డు పెట్టుకుని.. కింది స్థాయి ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక.. వీడియోలు కూడా తీశాడు జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఒకరు. తాజాగా అవి వైరల్‌ కావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Hyderabad: పదవిని అడ్డు పెట్టుకుని.. కింది స్థాయి ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక.. వీడియోలు కూడా తీశాడు జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఒకరు. తాజాగా అవి వైరల్‌ కావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published May 23, 2024 | 11:40 AMUpdated May 23, 2024 | 11:40 AM
పారిశుద్ద్య కార్మికారులిపై GHMC ఉద్యోగి లైంగిక వేధింపులు.. ప్రతి రోజూ గదిలోకి తీసుకెళ్లి..!

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. శిక్షలు విధించినా.. మృగాళ్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడవారు కనిపిస్తే చాలు.. పశువుల మాదిరి మీద పడి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆఖరికి పని ప్రదేశాల్లో కూడా ఇలాంటి వేధింపులు తప్పడం లేదు. కొందరు కీచక అధికారులు తమ పదవిని అడ్డం పెట్టుకుని.. కింది స్థాయి ఉద్యోగులను వేధింపులుకు గురి చేస్తుంటారు. వారి మాట వినికపోతే పని ప్రదేశంలో అవమానాలు, ప్రమోషన్ల విషయంలో అడ్డంకులు సృష్టిస్తారు. పదవిని అడ్డు పెట్టుకుని మహిళా ఉద్యోగులను వేధించే అధికారులు సమాజంలో చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో దారుణం వెలుగు చూసింది. పారిశుద్ధ్య కార్మికురాలనిపై కన్నేసిన ఓ ఉద్యోగి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దరిద్రాన్నంత వీడియోలు తీసుకున్నాడు. అయితే తాజాగా అవి బయటకు రావడంతో.. ఈ కామాంధుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారంలో చోటు చేసుకుంది. 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ)గా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి తన అండర్‌లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేసాడు. ఆమెను లొంగదీసుకుని.. శారీరంగా వాడుకోవాలని భావించాడు. తన కోరిక తీర్చాలని.. లేదంటే ఇబ్బందులు తప్పవని బెదిరించాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. ఉద్యోగం నుంచి తొలగిస్తానని చెబుతూ వేధింపులకు దిగాడు.

ఉద్యోగం పోతుందనే భయంతో.. ఆ బాధితురాలు ఈ నరకాన్ని మౌనంగా భరించింది. దీని గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన పడింది. ఇక చివరకు గతిలేని పరిస్థితుల్లో.. ఆ మృగాడి వాంఛకు బలైంది. అతడి రాక్షసత్వాన్ని భరించేందుకు సిద్దం అయ్యింది. బాధితురాలు అతడి కోరిక తీర్చడానికి అంగీకరించడంతో.. ఆ అధికారి రెచ్చి పోయాడు. ప్రతి రోజు విధులుకు వచ్చే సదరు పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక.. ఆ దరిద్రాన్ని తన ఫోన్‌లో వీడియోలు తీసుకున్నాడు.

మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. కీచక అధికారి కిషన్‌ మొబైల్‌లో ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. పారిశుద్ధ్య కార్మికురాలిపై అతడు జరిపిన లైంగిక దాడి వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లాయి. వాటిని చుసిన తోటి కార్మికులు ఉద్యోగిని ప్రశ్నించటంతో.. ఎవరికి చెప్పవద్దంటూ కాళ్లావేళ్లా పడి వారికీ ఒక్కొక్కరికి 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కిషన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి