iDreamPost

సహజీవనం చేసే కపుల్స్‌కి, బ్యాచిలర్స్‌కి మాత్రమే ఇల్లు అద్దెకిస్తా.. ఓనర్ సంచలన నిర్ణయం!

House For Rent For Only Bachelors, Live-in Couples: బ్యాచిలర్స్ కి రెంట్ కి ఇల్లు దొరకడం చాలా కష్టం. ఫ్యామిలీస్ కే ఇస్తామని భీష్మించుని కూర్చుంటారు. అదేంటో బ్యాచిలర్స్ అంటే క్రైమ్ చేసినట్టు చూస్తారు. ఇక సహజీవనం చేసే బ్యాచ్ కి ఇల్లు దొరకడం అంటే గగనమే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిలా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. బ్యాచిలర్స్ కి, సహజీవనం చేసేవారికి ఇల్లు అద్దెకు ఇవ్వడం కోసం ఏకంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అద్దె ఇళ్ల కోసం చాలా మంది కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరుగుతారు. టూలెట్ బోర్డులు ఎన్ని కనబడినా గానీ అందులో వారికి కావాల్సింది మాత్రం ఉండదు. ఎందుకంటే చాలా వరకూ టూలెట్ బోర్డులన్నీ కూడా ‘ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్’ అనే ఉంటాయి. ఫ్యామిలీస్ కి మాత్రమే ఇస్తామని అంటారు. కొన్ని ఏరియాల్లో అయితే కాలనీ మొత్తం ఒకే నిర్ణయం మీద ఉంటారు. ఏ ఇంటికి వెళ్లినా గానీ బ్యాచిలరా ఇల్లు ఇవ్వంగా అని అంటారు. దీంతోనగరాల్లో బ్యాచిలర్స్ కి ఇల్లు దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. ఇక సహజీవనం చేసే కపుల్స్ కి ఇల్లు దొరకడం అంటే నరకమే. బ్యాచిలర్స్ కే ఇవ్వట్లేదు.. అలాంటిది పెళ్ళికి ముందు కలిసుండే మీకెందుకు ఇస్తాం అని గెటవుట్ అంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వీరి కష్టాలను తెలుసుకుని ఒక స్టార్టప్ కంపెనీ అధినేత ఒక ఇల్లు కొని సహజీవనంలో ఉన్న కపుల్స్ కి, బ్యాచిలర్స్ కి ఇల్లు అద్దెకు ఇస్తా అని ప్రకటించాడు. వూష్ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రియం సరస్వత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సమీపంలో ఒక పెద్ద 2 బీహెచ్కే ఇంటిని కొనుగోలు చేశాడు. దాన్ని బ్యాచిలర్స్ కి, సహజీవనం చేసే వారికి మాత్రమే అద్దెకి ఇస్తానని ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇంటిని కూడా చూపించాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ సమీపంలో  ఫుల్లీ ఫర్నిష్డ్ 2 బీహెచ్కే హౌస్ రెంట్ కి ఉందని.. సింగపూర్ థీమ్ తో ఇల్లు నిర్మించబడిందని చెప్పుకొచ్చాడు. మోడర్న్ ట్రాన్స్ ఫర్మేషనల్ ఫర్నీచర్ తో ఇల్లు అద్దెకు ఇస్తున్నా అని ఆ యజమాని వెల్లడించాడు.

బెడ్, బెడ్ షీట్లు కొనుక్కోవాల్సిన పని లేదని.. విశాలమైన వార్డ్రోబ్ లు, ఫుల్లీ మాడ్యులర్ కిచెన్, అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఇంటిని రెంట్ కి ఇస్తున్నా రండి అంటూ ప్రకటించాడు. అయితే ఈ ఇల్లు కేవలం బ్యాచిలర్స్ కి, లివిన్ రిలేషన్ లో ఉన్న కపుల్స్ కి మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. తనకు సమాజం ఎంతో ఇచ్చింది.. సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా అని తెలిపాడు. ఇల్లులు అద్దెకు దొరక్క ఇబ్బందులు పడుతున్న బ్యాచిలర్స్, సహజీవనం చేసే కపుల్స్ పడే ఇబ్బందులు చూసి ఈ నిర్ణయం తీసుకున్నా అని వెల్లడించారు. ప్రియం సరస్వత్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. యజమానుల్లో నువ్వు దేవుడివి సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి