iDreamPost

రాసి పెట్టుకోండి అంటూ.. ట్రైలర్ పై అంచనాలు పెంచేసిన సలార్ నిర్మాత!

  • Author ajaykrishna Published - 03:19 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 03:19 PM, Sat - 8 July 23
రాసి పెట్టుకోండి అంటూ.. ట్రైలర్ పై అంచనాలు పెంచేసిన సలార్ నిర్మాత!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా ఇది. డార్లింగ్ ప్రభాస్ ని తన సినిమాటిక్ యూనివర్స్ లో ఊరమాస్ క్యారెక్టర్ తో పరిచయం చేయనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా.. ఇటీవల టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేర్చింది. టీజర్ లో ప్రభాస్ ని చూపించలేదని విమర్శలు ఉన్నప్పటికీ.. ట్రైలర్ లో, మూవీలో చూసుకోవచ్చులే అని సర్దిచెప్పుకుంటున్నారు అభిమానులు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతోంది.

కేజీఎఫ్, కాంతార చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తుండటం విశేషం. కాగా.. ముందు నుండి సలార్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం కళ్లు కాయలు కాచేలా రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్.. ఇండియాలోనే మోస్ట్ వ్యూస్ కొల్లగొట్టిన రికార్డు సెట్ చేసింది. అయితే.. టీజర్ తర్వాత ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ తారసపడుతోంది అదేంటంటే.. సలార్ ట్రైలర్ మరింత వయిలెంట్ గా చాలా స్టఫ్ తో రానుందట.

అదికూడా సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ కాబట్టి.. ఆగష్టు చివరి వారంలో సలార్ ట్రైలర్ వస్తుందని సమాచారం. అయితే.. సలార్ ట్రైలర్ గురించి క్యాలెండరులో డేట్ ని మార్క్ చేసి పెట్టుకోవాలంటూ.. ఇండియన్ సినిమా గ్రాండియర్ ని చూపించే విధంగా ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి టీజరే ఇలా ఉందంటే.. ట్రైలర్ ఎలాగైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ కేజీఎఫ్ లో భాగమే కాబట్టి మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్, కీలకపాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి