iDreamPost

హోలీ రోజున ఈమొక్కకు పూజిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయట

దేశ వ్యాప్తంగా సంబరాలతో జరుపుకునే పండుగల్లో ఒకటి హోలీ. ఆ రోజు వస్తే చాలు చిన్నా, పెద్దా అని తేడా తెలియకుండా రంగుల కేళి ఆడుతుంటారు. సరదాగా సాగిపోయి ఈ పండుగ నాడు.. ఆ మొక్కను పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయట.

దేశ వ్యాప్తంగా సంబరాలతో జరుపుకునే పండుగల్లో ఒకటి హోలీ. ఆ రోజు వస్తే చాలు చిన్నా, పెద్దా అని తేడా తెలియకుండా రంగుల కేళి ఆడుతుంటారు. సరదాగా సాగిపోయి ఈ పండుగ నాడు.. ఆ మొక్కను పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయట.

హోలీ రోజున ఈమొక్కకు పూజిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయట

చిన్నా, పెద్ద అని మర్చిపోయి.. ఆనంద ఢోలికతో చేసుకునే పండుగ హోలీ. రంగులు లేదా రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, అద్దుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు . ఈ పండుగను కేవలం భారతీయులే కాదూ.. నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునితమైనదని అర్థం. ఏటా ఫాల్లుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే పండుగను హోలీ, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది మార్చి 25న అనగా ఈ ఫెస్టివల్ వచ్చింది. రాక్షస రాజు హిరణ్య కశ్యపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు మూర్తి భక్తుడు. నిత్యం అతని నామస్మరణ చేస్తుండాన్ని సహించలేకపోతాడు హిరణ్య. అతడిని బెదిరించినా ప్రహ్లాదుడిలో మార్పు ఉండదు. దీంతో అతడిని చంపేయాలని ప్రయత్నాలు చేస్తాడు. తన సోదరి హోళికను పిలిచి.. అతడిని ఒడిలో కూర్చొబెట్టుకొని చితిలో దూకాలని ఆజ్ఞాపిస్తాడు.

సోదరుడు హిరణ్య ఆదేశాల మేరకు ప్రహ్లాదుడితో సహా మంటల్లో దూకేస్తుంది హోళిక. దీంతో శ్రీ మహా విష్ణువును పూజిస్తాడు ప్రహ్లాద. కానీ ఈ మంటల నుండి సజీవంగా బయటకు వస్తాడు అతడు. హోళిక ఆ అగ్నికి ఆహుతి అయిపోతుంది. అందుకే ఈ పండుగను హోళిక పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజునే హోళిక దహనం చేస్తారు ప్రజలు. హోలీ రోజున భగవాన్ ఆరాధన చేసి.. అనంతరం రంగుల కేళి నిర్వహించుకుంటారు. విష్ణు, లక్ష్మి దేవీని, రాధా కృష్ణులను పూజిస్తుంటారు.తమ ఇంట్లో సిరి సంపదలు కలగాలని పూజలు చేస్తారు.హోలీ పండుగ నాడు ఈ మొక్కను పూజిస్తే బాధలు తొలగిపోయి.. సమస్త కోరికలు తీరతాయట. ఇంతకు ఆ మొక్క ఏంటంటే.. ఇంద్రజాల్.

Indrajal tree on holi day

పురాణాల ప్రకారం.. ఇంద్రుడు రావణాసురుడితో యుద్దం చేస్తున్నప్పుడు.. తన మాయజాలాన్ని సముద్రంలో పరిచాడట. అదే ఇంద్రజాల్ మొక్కగా మారిందట. ఇంద్రజాల్ ఓ సముద్రపు మొక్క. ఇవి చాలా అరుదుగా దొరకుతుంటాయి. రామేశ్వరం, అండమాన్, నికోబార్, లక్ష్మద్వీప్, సింగపూర్ వంటి సముద్ర తీరంలో మాత్రమే లభిస్తాయి. జాతకం బాగోలేదు, ఏ పని చేస్తున్నా ముందుకు సాగడం లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, కుటుంబంలో ఇబ్బందిగా ఉంది అని భావిస్తున్న బాధపడేవారు.. దీన్ని పూజిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. ఇది శక్తివంతమైన మొక్కగా భావిస్తారట. క్షీర సాగర మధనం నుండి చాలా వస్తువుల వచ్చినట్లే.. ఈ మొక్క కూడా వచ్చిందట. ఇది ఇంద్రుడి శక్తిని ప్రదర్శించగల మొక్కగా చెబుతున్నారు పండితులు.

దీన్ని ఎలా వినియోగించాలంటే.. హోలీ పూర్ణిమ నాడు పూజ చేసుకుని ఫ్రేమ్‌గా చేసి ఇంట్లో ఉత్తర గోడకు తగిలించుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వాస్తు దోషాలు, నర దృష్టి తొలగిపోతుందట. ఎర్రటి వస్త్రంలో కట్టి.. బీరువాలో పెట్టుకుంటే.. ధన వృద్ధి ఉంటుందట. హోలీ నాడు ఈ మొక్కకు గంగాజలంతో శుద్ది చేసి.. గంధంతో బొట్టు పెట్టి.. ధూప దీపం చూపించి.. మీ మనస్సులో కోరిక చెప్పుకుని, ఇష్ట దైవ నామాన్ని 108 స్మరించి.. ఫ్రేమ్ లో పెట్టుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. దీన్ని నమ్మి పూజ చేస్తేనే విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు పండితులు. కోరిన కోరికలు తీరుతాయట. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే.. ఈ మొక్కను పెట్టుకుంటే..మంచి జరుగుతుందట.

నోట్:  ఇది అంతర్జాలంలో దొరికిన  సమాచారం ప్రకారం.. ఇవ్వడం జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి