iDreamPost

పోలీసుల విచారణలో దర్శన కీలక వ్యాఖ్యలు.. రెండు దెబ్బలు వేశాను అంటూ..!

Hero Darshan On His Role In Renuka Swamy Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్ కూడా తన పాత్రకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు అంటున్నారు. రేణుకాస్వామిని కొట్టిన విషయాన్ని వెల్లడించాడు.

Hero Darshan On His Role In Renuka Swamy Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్ కూడా తన పాత్రకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు అంటున్నారు. రేణుకాస్వామిని కొట్టిన విషయాన్ని వెల్లడించాడు.

పోలీసుల విచారణలో దర్శన కీలక వ్యాఖ్యలు.. రెండు దెబ్బలు వేశాను అంటూ..!

హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి(28) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్శన్, ఆయన సహజీవనం చేస్తున్న నటి పవిత్రా గౌడ సహా 9 మందికి న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. తొలుత విధించిన రిమాండు సోమవారం వరకు ఉన్నా కూడా పోలీసులు వీరిని శనివారమే కోర్టుకు తీసుకెళ్లారు. సోమవారం బక్రీదు సందర్భంగా సెలవు ఉండటంతో ముందుగా హాజరు పిరాచమని తెలిపాసు. ఈ కేసులో దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. అదే విధంగా దర్శన్ కూడా ఈ కేసులో తన పాత్రకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. దాదాపుగా దర్శన్ మీదకు ఈ కేసు వచ్చేలా కనిపిస్తోంది. తాను కేవలం రెండు దెబ్బలే వేశాను అంటూ దర్శన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యలో పాల్గొన్న మరో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో దాదాపుగా విచారణ పూర్తైనట్లే తెలుస్తోంది. ఎందుకంటే పోలీసులు హత్య జరిగిన ప్రదేశం నుంచి క్లూస్, హత్య జరిగిన ప్రదేశం చుట్టు పక్కల సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు. అలాగే దర్శన్ పాత్ర మీద కూడా దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. అలాగే ఈ కిడ్నాప్- హత్యలో పాల్గొన్న వాళ్లు కూడా నేరాన్ని అంగీకరించారు. అయితే ఇంకా దర్శన్ కి సంబంధించే విచారణ జరిగే ఛాన్స్ ఉండచ్చు.

ఇప్పటికే దర్శన్ తన పాత్రను వెల్లడించినట్లు చెబుతున్నారు. పవిత్రా గౌడకు అశ్లీల చిత్రాలు పెట్టడంతో అతడిని మందలించాలని అనుకున్నట్లు చెప్పాడు. అలాగే అతనితో పవిత్రకు క్షమాపణ చెప్పించాలి అని అనుకున్నాడంట. అందుకే రేణుకాస్వామి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అక్కడ తమని చూడగానే అతను తప్పు అయ్యిందిని కాళ్ల మీద పడ్డాడని వెల్లడించాడు. అతడిని రెండు దెబ్బలు వేశాను అన్నాడు. ఆ తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి భోజనం చేసి వెళ్లమన్నట్లు వెల్లడించాడు. అయితే అక్కడ ఉన్న వాళ్లే అతడిని కొట్టి ఆ నేరాన్ని తన తలకు చుట్టారు అంటూ దర్శన్ వ్యాఖ్యానించాడు.

చిత్ర హింసలు:

అసలు ఈ కేసులో ఏం జరిగిందంటే.. రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించారు. అక్కడి నుంచి బెంగళూరులోని పట్టణగెరెలోని ఓ షెడ్డులో ఉంచారు. అక్కడ అతడిని చిత్రహింసలు పెట్టారు. అతను శాకాహారిని అని చెప్పినా కూడా బలవంతంగా బిర్యాని పెట్టారని.. ఎముక నోట్లో పెట్టి తినమని బలవంతం చేశారని చెప్పారు. ఆ సమయంలో ‘మాంసం తింటే శక్తి వస్తుంది.. బాస్ కొట్టినా తట్టుకుంటావు’ అని హేళన చేసినట్లు విచారణలో తెలిసింది. ఆ పట్టణగెరె చుట్టు పక్కల ప్రాంతాల్లో అన్ని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు గమనించారు. ఘటన జరిగిన ప్రాంతానికి దర్శన్ కారు రావడం కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. నేను కేవలం రెండు దెబ్బలే వేశాను అంటూ దర్శన్ కూడా దాదాపుగా తన నేరాన్ని అంగీకరించినట్లు అవుతోంది. ఇంక దర్శన్ కు ఎంత మేర శిక్ష పడుతుంది అనేదే అసలు ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి