iDreamPost

Bheemla Nayak : పవన్ సినిమాకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందా ?

Bheemla Nayak  : పవన్ సినిమాకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందా  ?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ రానాల మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ డిసెంబర్ మొదటి వారం లోపే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకునేలా కనిపిస్తోంది. జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని పదే పదే చెబుతున్నారు కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు వెనక్కు తగ్గకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా సితార సంస్థ మాట మీద ఉంటుందానే అనుమానాలు కలుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన ప్లస్ పర్యవేక్షణలో సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో పవన్ కు జోడిగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడో కొత్త వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ నుంచి భీమ్లా నాయక్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం 150 కోట్ల ఆఫర్ వచ్చిందని దాని సారాంశం. గతంలో పవన్ కు ఏపి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా థియేటర్లలో కాకుండా పవన్ మూవీ డిజిటల్ లో వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వార్త చల్లబడిపోయింది. కానీ ఇప్పుడీ నూటా యాభై కోట్ల టాక్ మాత్రం అంత తేలిగ్గా కొట్టిపారేసే న్యూస్ కాదు. ఎందుకంటే ఇది చాలా భారీ మొత్తం. ఒకవేళ థియేటర్ల ద్వారా ఇంత మొత్తం షేర్ రూపంలో రావాలంటే భీమ్లా నాయక్ సుమారు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. సినిమా ఎంత బాగున్నా ఇది అసాధ్యం.

పైగా అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కాబట్టి అన్ని బాషల సినిమా తెలుగు మూవీ లవర్స్ ఆల్రెడీ చూసేశారు. దీని ప్రభావం ఎంతో కొంత ఉండకపోదు. అయితే పవన్ త్రివిక్రమ్ లు ఈ డీల్ కి ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ జనవరిలో టికెట్ రేట్లు, అదనపు షోల వ్యవహారం ఒక కొలిక్కి రాకపోతే అప్పుడేమైనా ఆలోచనలో పడొచ్చు కానీ లేదంటే ఛాన్స్ తక్కువే. కానీ ఇక్కడ సినిమా ఎలా వచ్చిందన్నది ముఖ్యం. నారప్ప, టక్ జగదీష్, మాస్ట్రోలు థియేటర్లో పెద్దగా ఆడే మెటీరియల్ లేదని గుర్తించాకే ఓటిటికి వెళ్లి లాభ పడ్డాయి. మరి భీమ్లా నాయక్ అలా చేయకపోవచ్చు కానీ ఏమో గుర్రమెగారావచ్చు తరహాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మరి

Also Read : Oscars : అవార్డులు వస్తేనే మంచి సినిమాలు తీసినట్టా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి