iDreamPost

స్టార్ బౌలర్స్ అన్నారు.. ఈ చెత్త రికార్డ్స్ ఏంటి! వరల్డ్ కప్ చరిత్రలోనే..

  • Author Soma Sekhar Published - 05:25 PM, Sat - 4 November 23

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు పాక్ పేసర్ హారిస్ రౌఫ్. ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి బౌలర్ గా ఈ వరస్ట్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు పాక్ పేసర్ హారిస్ రౌఫ్. ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి బౌలర్ గా ఈ వరస్ట్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

  • Author Soma Sekhar Published - 05:25 PM, Sat - 4 November 23
స్టార్ బౌలర్స్ అన్నారు.. ఈ చెత్త రికార్డ్స్ ఏంటి! వరల్డ్ కప్ చరిత్రలోనే..

వరల్డ్ కప్ 2023 బ్యాటర్ల టోర్నీ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ మెగా ఈవెంట్లో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. దీంతో ఎంతటి స్టార్ బౌలర్లు అయినా.. దండిగా పరుగులు సమర్పించుకోవడం తప్పడం లేదు. ఇక వరల్డ్ క్లాస్ బౌలర్లు మాకు ఉన్నారని చెప్పుకునే పాక్ బౌలర్ల పరిస్థితి మరీ దారుణంగా తయ్యారు అయ్యింది. ఈ టోర్నీలో పాక్ జట్టు మూకుమ్మడిగా విఫలం అవుతున్న వేళ.. పలు చెత్త రికార్డులను సైతం ఆ జట్టు ఆటగాళ్లు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ బౌలర్లు షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ లు ధారాళంగా రన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రౌఫ్, షాహిన్ అఫ్రిదిలు వరల్డ్ కప్ హిస్టరీలోనే ఓ చెత్త రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.

షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్.. ఈ త్రయం వరల్డ్ క్లాస్ బౌలర్లు అని పదే పదే పాక్ జట్టు వరల్డ్ కప్ ముందు చెప్పుకొచ్చిన విషయం మనందరికి తెలిసిందే. కానీ ప్రపంచ కప్ ఆరంభం అయ్యాక తెలిసింది వీరు ఎంతటి మెునగాళ్లో అని. పాక్ చెప్పిన మాటలు ఉత్త నోటి మాటలే అని నిరూపిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లు ఈ ముగ్గురు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఈ మెగాటోర్నీలో. దీంతో వీరి ఖాతాల్లో పలు చెత్త రికార్డులు నమోదు అవుతూ ఉన్నాయి. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో హారిస్ రౌఫ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే?

వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్ లో అత్యధిక సిక్స్ లు(16) ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అదీకాక తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతడు ఇలా 80కి పైగా పరుగులు సమర్పించుకోవడం ఈ వరల్డ్ కప్ లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. షాహీన్ అఫ్రిది సైతం ఈ మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 90 రన్స్ ఇచ్చిన అఫ్రిది ఒక్కటంటే ఒక్క.. వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో గతంలో తన సహచర బౌలర్ హసన్ అలీ(84 పరుగులు) రికార్డును బద్దలు కొట్టి.. తనపేరిట ఆ వరస్ట్ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇక వీరి ప్రదర్శన చూసిన నెటిజన్లు.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు అన్నారు? వీళ్లేంటి ఇంత దరిద్రంగా రన్స్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వరల్డ్ కప్ హిస్టరీలో రౌఫ్ క్రియేట్ చేసిన చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి