iDreamPost

షమీ సక్సెస్ వెనుక హార్దిక్ పాండ్యా! ఏమి చేశాడంటే?

వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందరూ కూడా షమీ సక్సెస్ ని తెగ పొగిడేస్తున్నారు. అయితే షమీ సక్సెస్ వెనుక ఉన్నది మాత్రం హార్దిక్ పాండ్యా అంట. మరి.. ఆ కథేంటో చూడండి.

వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందరూ కూడా షమీ సక్సెస్ ని తెగ పొగిడేస్తున్నారు. అయితే షమీ సక్సెస్ వెనుక ఉన్నది మాత్రం హార్దిక్ పాండ్యా అంట. మరి.. ఆ కథేంటో చూడండి.

షమీ సక్సెస్ వెనుక హార్దిక్ పాండ్యా! ఏమి చేశాడంటే?

మహ్మద్ షమీ.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. టీమిండియాని నాకౌట్ మ్యాచ్ లో ఒంటిచేత్తో సగర్వంగా ఫైనల్స్ చేర్చాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో 23 వికెట్లు తీసి రికార్డులు బద్దలుకొట్టాడు. కొన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో వేగంగా 50 వికెట్లు తీయడం, టీమిండియా తరఫున వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన బౌలర్ గా మారడం ఇలా ఒక్క మ్యాచ్ తో చాలానే రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు నెట్టింట ఒక కొత్త వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. షమీ ప్రదర్శన వెనుక ఉన్న వ్యక్తి హార్దిక్ పాండ్యా అంటూ చెబుతున్నారు. తమ తిక్కకు ఒక లెక్క కూడా ఉందంటూ సమర్థించేసుకుంటున్నారు.

మహ్మద్ షమీ దేశం గర్వపడేలా చేశాడు. ఒకానొక సమయంలో అసలు మ్యాచ్ చేజారిపోయింది అనిపించింది. కానీ, షమీ తిరిగి ట్రాక్ లోకి వచ్చి మ్యాచ్ ని వన్ సైడ్ చేశాడు. ఎక్కడా కూడా ప్రత్యర్థికి ఆస్కారం లేకుండా విజయాన్ని మన సొంతం చేశాడు. ఇప్పుడు అందరూ కూడా షమీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. షమీని మించిన బౌలర్ లేడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. షమీ నువ్వు తోపు అంటూ జేజేలు కొడుతున్నారు. టీమిండియా మాజీలు, దిగ్గజాలు కూడా షమీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో వింత వాదన కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. షమీ సక్సెస్ వెనుక ఉన్నది హార్దిక్ పాండ్యా అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అలా ఎలా అవుతుంది అంటూ వెంటనే కన్నెర్ర చేయకండి. అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే.. వరల్డ్ కప్ తొలి మ్యాచుల్లో తుది జట్టులో షమీకి అవకాశం దక్కలేదు. అయితే హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడో అప్పుడు షమీకి జట్టులో చోటు దక్కింది.

హార్దిక్ పాండ్యాకి గాయం కాకపోతే నిజంగానే ఈ వరల్డ్ కప్ లో షమీ ఆడేవాడు కాదేమో? ఆ ఉద్దేశంతోనే షమీ సక్సెస్ వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడు అంటూ కామెంట్స చేస్తున్నారు. ఇంకొందరైతే షమీని మాత్రమే కాదు.. హార్దిక్ ని కూడా పొగడాలి అంటున్నారు. తన కెరీర్ ని త్యాగం చేసి మహ్మద్ షమీకి ఈ ఛాన్స్ ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరదాగా చెప్పినా.. సీరియస్ గా చెప్పినా.. ఈ వాదనలో కూడా అర్థం ఉంది. హార్దిక్ పాండ్యాకి గాయం కాకపోతే షమీ జట్టులోకి వచ్చేవాడే కాదు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకి ఇలాంటి అద్భతమైన విజయాలను ఇచ్చేవాడే కాదు. కాబట్టి ఆల్ క్రెడిట్ గోస్ టూ మిస్టర్ హార్దిక్ పాండ్యా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. జట్టు గుర్తించకపోయినా కొందరు అభిమానులు హార్దిక్ త్యాగాన్ని గుర్తించినందుకు అభినందించాలి. పాండ్యా ఇచ్చిన అవకాశాన్ని షమీ ఇలాగే సద్వినియోగం చేసుకుంటూ ఫైనల్స్ లో కూడా ఐదారు వికెట్లు పడగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి.. షమీ సక్సెస్ వెనుక పాండ్యా ఉన్నాడు అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి