iDreamPost

సినీ ప్రియులకు శుభవార్త.. అన్ని థియేటర్లలో రేట్లు తగ్గింపు!

సినీ ప్రియులకు శుభవార్త.. అన్ని థియేటర్లలో రేట్లు తగ్గింపు!

మన దేశంలో సినిమాలపై ఆసక్తి ఉన్న వారి సంఖ్య అధికంగా ఉంది. క్రికెట్ తరువాత సినీ ఇండస్ట్రీకి మంచి ఆదరణ ఉన్న విషయం  అందరికి తెలిసిందే.  ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సినిమాల రిలీజ్ ను ఒక పండుగలా జరుపుకుంటారు. కేవలం హీరో, హీరోయినల అభిమానులే కాకుండా.. మిగిలిన వాళ్ళు కూడా థియేటర్ల లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో థియేటర్లలో టికెట్ల ధరలతో పాటు తినుబండారాల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినీ ప్రియులకు పండుగ లాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది.  మరి.. ఆ వార్త ఏమిటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమాల టికెట్ ధరలు పెరగడంతోనే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే థియేటర్లలో లభించే తినుబండారాలపై కేంద్రం వస్తు సేవల పన్ను18 శాతం విధించింది. దీనికి తోడు కొందరు థియేటర్ల వాళ్లు వీటి రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  సినిమా హాళ్లలో లభించే పాప్‌కార్న్, బేవరేజెస్‌పై పన్ను శాతం తగ్గించాలని  కొందరు జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేశారు. ఈ విజ్ఞప్తులపై సమగ్రంగా విచారణ జరిపిన కౌన్సిల్ సభ్యులు మంగళవారం జరిగిన 50వ సమావేశంలో పన్ను శాతాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో తినుబండారాలపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.

అయితే తాజాగా వీటిపై 5 శాతం తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ తాజాగా నిర్ణయాన్ని వస్తు సేవల పన్ను సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, కొత్త జీఎస్టీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులపై చాలా వరకూ భారం తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది నిజంగా మూవీ లవర్స్ పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు. మరి.. థియేటర్లలో తినుబండారాలపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి