iDreamPost

వాలంటీర్లపై ప్రతిపక్షాల ఆరోపణలు.. గ్రౌండ్ లెవల్లో పబ్లిక్ ఏమంటున్నారో చూడండి!

వాలంటీర్లపై ప్రతిపక్షాల ఆరోపణలు.. గ్రౌండ్ లెవల్లో పబ్లిక్ ఏమంటున్నారో చూడండి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన వాటిల్లో వాలంటరీ, సచివాలయ వ్యవస్థలు ప్రధానమైనవి. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రభుత్వం  పథకాలను, సేవలను అందిస్తున్నారు. ఇలా నాలుగేళ్ల నుంచి వారి సేవ కొనసాగుతుంది. అయితే ఇటీవల ఈ వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు జనసేన, టీడీపీ అనేక ఆరోపణలు  చేశాయి. వారి మాటలకు ధీటుగా అధికార వైసీపీ కూడ  స్పందిస్తోంది. అయితే అధికార, ప్రతిపక్షాల మాటలు ఎలా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పబ్లిక్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక విషయాలు తెలిపారు.

కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయంలో వాలంటీర్లపై ఇష్యూ బాగా నడుస్తుంది. అధికార వైసీపీ, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.  రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలు కిడ్నాప్ కావడానికి కారణం వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారమే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో ఈ వార్ మొదలైంది. రాష్ట్రం ప్రజల సమాచారం అంతా హైదరాబాద్ లో ఉందని పవన్ ఆరోపించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి.. వాళ్ల వ్యక్తిగత సమాచారం సేకరించడం కారణంగానే కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకు వెళ్లి అందిస్తున్న వాలంటీర్లను అవమానిస్తారా? అంటూ అధికార వైసీపీ కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతుంది. వారు ప్రజలకు చేస్తున్న సేవను గుర్తించక పోగా.. వారినే అవమానిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థ  ఇష్యూపై స్టేట్ లో హాట్ హాట్ గా ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో పబ్లిక్ మాత్రం వాలంటీర్ల గురించి అనేక విషయాలు వెల్లడించారు. వాలంటరీ వ్యవస్థ చాలా బాగుందని, ప్రభుత్వం అందించే పథకాల గురించి వాలంటీర్లే తమ వద్దకు వచ్చి వివరిస్తున్నారని అంటున్నారు. అలానే తాము పిలిచిన కూడా వాలంటీర్లు ఇళ్లల్లోకి రారని, కేవలం బయట నుంచే సమాచారం తీసుకుని, పథకాలు అందిస్తుంటారని అంటున్నారు.

గతంలో వివిధ రకాల సర్టిఫికేట్లు, ఇతర పథకాలను పొందేందుకు  ఆఫీసుల చుట్టు తిరిగేవాలమని, అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఆ బాధ తొలగిందని కొందరు అంటున్నారు. ఈ వ్యవస్థ కారణంగా ప్రతి నెల ఒకటో తారీఖు ఇంటి వద్దకు వచ్చి మరీ.. పెన్షన్ ఇస్తున్నారని వృద్ధులు తెలిపారు. వాలంటీర్ల వల్ల పనులు సకాలంలో జరుగుతున్నాయే తప్ప, ఎలాంటి నష్టం, ఇతర అపాయాలు జరగడం లేదని కొందరు అంటున్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేసేవి కేవలం అసత్య ఆరోపణలే అని పబ్లకి అంటుంది. వాలంటీర్లపై పబ్లిక్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో ఫలితాన్నిస్తున్న ‘జగనన్న సురక్ష’!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి