iDreamPost

Greg Chappell: వార్నర్ ని మించిన విధ్వంసం ఆ టీమిండియా ఓపెనర్ వల్లే సాధ్యం: ఆసీస్ లెజెండ్

ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ టీమిండియా ఓపెనర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కంటే ఆ ఓపెనర్ చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ టీమిండియా ఓపెనర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కంటే ఆ ఓపెనర్ చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు.

Greg Chappell: వార్నర్ ని మించిన విధ్వంసం ఆ టీమిండియా ఓపెనర్ వల్లే సాధ్యం: ఆసీస్ లెజెండ్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. వారు తమదైన ఆటతీరుతో ఈ జెంటిల్ మన్ గేమ్ లో తమకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. అయితే దశాబ్దానికి ఒకరు విధ్వంసకర వీరులు క్రికెట్ కు పరిచయం అవుతూ ఉంటారు. కానీ ఎన్ని దశాబ్దాలు గడిచినా గానీ.. కొందరు ప్లేయర్ల పేరును ఇంకా జపిస్తూనే ఉంటారు. తాజాగా ఆసీస్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ టీమిండియా ఓపెనర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కంటే ఆ టీమిండియా ఓపెనర్ చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఆధునిక యుగంలో అలాంటి డేంజరస్ బ్యాటర్ ను తాను చూడలేదని కితాబిచ్చాడు. మరి ఆ ఆటగాడు ఎవరు?

డేవిడ్ వార్నర్.. ఇటీవలే వన్డేలకు గుడ్ బై చెప్పి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఓపెనర్ల జాబితాలో వార్నర్ కచ్చితంగా ఉంటాడు. తన తుఫాన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను సులువుగా ఒత్తిడిలోకి నెట్టి, పరుగులు పిండుకుంటాడు. కానీ డేవిడ్ వార్నర్ కంటే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ ఇంకొకరు ఉన్నారని, ఈ ఆధునిక యుగంలో అతడొక్కడే అత్యంత డేంజరస్ ఓపెనర్ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ మాజీ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్. ఇంతకీ చాపెల్ చెప్పింది మరెవరిగురించో కాదు.. టీమిండియా మాజీ బ్యాటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి.

ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తో చాపెల్ మాట్లాడుతూ..”ఈ ఆధునిక యుగంలో ప్రపంచ క్రికెట్ చరిత్రలో మోస్ట్ డ్యామేజింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. విధ్వంసకర ఓపెనర్ గా డేవిడ్ వార్నర్ సైతం సెహ్వాగ్ వెనకాలే ఉంటాడు. వార్నర్ కంటే సెహ్వాగ్ అత్యంత ప్రమాదకరం” అంటూ కితాబిచ్చాడు చాపెల్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. వీరేంద్రుడి విధ్వంసం గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతడు క్రీజ్ లోకి దిగితే బౌలర్ కు ముచ్చెమటలు పట్టాల్సిందే.

ఫార్మాట్ ఏదైనా సెహ్వాగ్ కు ఒక్కటే. టెస్టులు, వన్డేలు, టీ20లు అని చూడటం వీరూ భాయ్ కి అలావాటు లేదు. బ్యాటింగ్ కు దిగామా.. దబిడిదిబిడే. అందుకే వరల్డ్ క్రికెట్ లో వీరేంద్రుడికి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. దిగ్గజ బౌలర్లు సైతం సెహ్వాగ్ బ్యాట్ కు బలైయ్యారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి టీమిండియా ఆటగాడిగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ కెరీర్ విషయానికి వస్తే.. 104 టెస్టుల్లో 8586 పరుగులు, 251 వన్డేల్లో 8273 రన్స్, 19 టీ20ల్లో 394 పరుగులు చేశాడు. మరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్న గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి