iDreamPost

TSRTC ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

రేవంత్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రజారవాణాలో కీలక పాత్ర వహిస్తున్న సంస్థ ఉద్యోగుల సంక్షేమం పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.

రేవంత్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రజారవాణాలో కీలక పాత్ర వహిస్తున్న సంస్థ ఉద్యోగుల సంక్షేమం పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.

TSRTC ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురును అందించింది. సంస్థ ఉద్యోగులను ఆదుకునేందుకు వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ పీఆర్సీని ప్రకటించింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటించిన కొత్త పీఆర్సీ ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఇవాళ బస్ బవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గత ప్రభుత్వం 2017లో 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి పీఆర్సీ ఊసేలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. పెంచిన పీర్సీతో పేస్కేల్ 2017 సర్వీసులో ఉన్న 42,057 ఉద్యోగులకు, 01-04-2017 నుంచి పదవీ విరమణ చేసిన 11,014 ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగనున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. పీఆర్సీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి