iDreamPost

గూగుల్ లో రోడ్డుంది..నీళ్లలోకి లారీ వెళ్లింది..! అసలేం జరిగిందంటే..

గూగుల్ లో రోడ్డుంది..నీళ్లలోకి లారీ వెళ్లింది..! అసలేం జరిగిందంటే..

ప్రస్తుత కాలంలో చాలా మంది కొత్త మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు గూగుల్ సాయం తీసుకుంటారు. ఇక ఆ గూగుల్ మ్యాప్ సాయంతో మన గమ్యస్థానాలకు చేరుకుంటాము. అందులో చూపించే మార్గంలోనే వెళ్తూ.. మనం చేరాల్సిన చోటుకు చేరుకుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ చూపించే దారి చిక్కులు పడేస్తుంది. గూగుల్ చూపిన రోడ్డు మార్గంలో గోడలు అడ్డంగా కనిపిస్తాయి. తాజాగా కొందరు వ్యక్తులు కూడా అలానే చిక్కుల్లో పడ్డారు గూగుల్ చూపిన రోడ్డు మార్గంలో వెళ్తే.. చివరకు వారి వాహనం నీళ్లలోకి వెళ్లింది. స్థానికుల సాయం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన  సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

తమిళనాడుకు చెందిన  ఓ లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వెళ్లాల్సి ఉంది. ఆ లారీ డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు.. ఆ ప్రాంతాల్లోని రహదారులపై సరైన అవగాహన లేదు. దీంతో ఫోన్ లో గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేసుకుని, దాని ఆధారంగా వస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా నందారం స్టేజీ దాటిన తరువాత స్ట్రైట్ గానే దారి ఉన్నట్లు గూగుల్ చూపింది. వారికి సరైన అవగాహన లేక గూగుల్ చూపించిన మార్గంలోనే చీకట్లో లారీని నడుపుతూ వెళ్లారు. కాస్తా దూరం వెళ్లగానే లారీ నీటిలోకి వెళ్తుంది.

అయితే వాన వల్ల నిలిచిన నీరు అని డ్రైవన్, క్లీనర్ అనుకున్నారు.  కాస్తా ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. లారీ క్యాబిన్ వరకు నీళ్లు వచ్చాయి. కొద్ది కొద్దిగా క్యాబిన్  లోపలికి నీళ్లు రావడం ప్రారంభమైంది. లారీ  నీటి మధ్యలో ఆగిపోయింది.  తీరు చూస్తే.. అది గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్  నీరు అని తెలిసింది. దీంతో వారిద్దరూ కిందకు దిగి మెల్లగా సమీపంలో ఉన్న రామవరం గ్రామంలోకి వచ్చారు. తమ సమస్యను స్థానికులకు చెప్పగా వారు వెంటనే ఘటన స్థలానికి వెళ్లారు.

లారీకీ తాళ్లు కట్టి వెనక్కు లాగడంతో అతికష్టం మీద బయటకు వచ్చింది.  నిజానికి నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్ రోడ్డు ద్వారా మళ్లించారు. అయితే ఇటీవల కురిసిన వానలకు స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు రావడంతో పెను ప్రమాదం తప్పింది. గూగుల్ ఇచ్చిన రాంగ్  అడ్రెస్ కారణంగా.. ఆ లారీ నీటిలోకి వెళ్లింది. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి