iDreamPost

శుభవార్త: కొన్ని గంటల్లో మార్కెట్ లోకి భారత్ రైస్? కిలో రూ. 29కే!

సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర పద్దును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు ఆజానకమైన హామీలను అందించారు విత్త మంత్రి. ఇల్లు, ఉచిత విద్యుత్ హామీలతో పాటు..

సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర పద్దును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు ఆజానకమైన హామీలను అందించారు విత్త మంత్రి. ఇల్లు, ఉచిత విద్యుత్ హామీలతో పాటు..

శుభవార్త: కొన్ని గంటల్లో మార్కెట్ లోకి భారత్ రైస్? కిలో రూ. 29కే!

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోవడంతో విధాన పరమైన కీలక నిర్ణయాలు చేయలేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్‌ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా వేతన జీవులు..తమకు ఈ బడ్జెట్‌లో మినహాయింపులు ఉంటాయని ఆశించారు కానీ అలాంటి మ్యాజిక్ అయితే జరగలేదు. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆశలకు జీవం పోస్తూ కీలక ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. అద్దె ఇళ్లల్లో నివసించే వారి సొంతింటి కలను నిజం చేస్తామని, పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.

అలాగే ధరల పెరుగుదలను అరికట్టేందుకు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారత్ రైస్ అందించాలని కేంద్రం ఎప్పటి నుండో భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో 50 రూపాయలకు పై చిలుకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఈ ధరలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించినట్లు టాక్. భారత్ రైస్‌ను సబ్సిడీ అందిస్తూ రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కిలో రూ. 29కే రిటైల్ అవుటెల్స్ ద్వారా విక్రయించే ప్రణాళిక సిద్ధం చేస్తోందని, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగుమతులు, బహిరంగ మార్కెట్ అమ్మకాలపై నియంత్రణలు ఉన్నప్పటికీ.. అధిక ధరకు అమ్ముడవుతున్న బియ్యం రకాల రిటైల్ ధరలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ప్రస్తుతం..భారత్ దాల్ కేజీ రూ. 60, భారత్ ఆటా పిండి కేజీ రరూ. 27.5 సబ్సిడీ ధరలకు విక్రయిస్తోంది. అదనంగా ఎఫ్‌సీఐ తన మిగులు స్టాక్ ల నుంచి బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద 7 మిలియన్ టన్నుల గోధుమలను భారీ మొత్తంలో కొనుగోలుదారులకు విక్రయించింది. అయితే భారత్ రైస్ కింద ఎఫ్‌సీఐ వద్ద దాదాపు 0.45 ఎంటీ నాన్-ఫోర్టిఫైడ్ రైస్ స్టాక్ ను రైతుల సహకార సంస్థ నాఫెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ బాండార్స్ వంటి ఏజెన్సీల ద్వారా రిటైల్ విక్రయాల కోసం మొదటగా అందించనున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి