iDreamPost

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం ధర ఎంత ఉందంటే?

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం ధర ఎంత ఉందంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల పెరుగుతూ షాకిచ్చిన గోల్డ్ రేట్స్ నేడు పడిపోయాయి. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పెళ్లిల్లకు, ఫంక్షన్లకు, తమకు ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇచ్చేందుకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతేగాక బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు కూడా మొగ్గుచూపుతున్నారు. గోల్డ్ పై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు చూడొచ్చని మార్కెట్ నిపుణులు కూడా వెల్లడిస్తున్నారు. మరి నేడు తగ్గిన ధరలతో బంగారం కొనాలనుకునే వారు వెంటనే త్వరపడండి. నేడు తులం ఎంతుందంటే?

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ. 150 తగ్గింది. దీంతో నిన్న 58100 ఉన్న ధర నేడు రూ.57,950 వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ. 160 తగ్గింది. దీంతో నిన్న 63380 ఉన్న ధర నేడు రూ.63,220 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అదే విధంగా దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,820 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,370 ట్రేడ్ అవుతోంది.

today gold rates

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు సిల్వర్ రేట్లు కూడా తగ్గు ముఖం పట్టాయి. కిలో వెండిపై రూ. 300 తగ్గింది. దీంతో నిన్న 77000 పలికిన వెండి నేడు తగ్గిన ధరలతో రూ. 76700 వద్దకు చేరుకుని అమ్ముడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి