iDreamPost

మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన జియన్ రావు

మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన జియన్ రావు

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జియన్ రావు అధికార వికేంధ్రీకరణ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అంశాలపై తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదంటూ సూచించినట్టుగా ఈ ఉదయం నుండి కొన్ని చానెళ్లలో ప్రసారమౌతున్నవార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

అభివృద్ధి, అధికార వికేంధ్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధాని ని విశాఖపట్టణంలో ఏర్పాటు చెయ్యాలని తమ కమిటీ ప్రభుత్వానికి సూచించిందని, దానిలో భాగంగా ప్రభుత్వ పరిపాలనా భవనాలను సముద్ర తీరానికిదూరంగా విశాఖ నగరానికి 30 కిలోమీటర్ల విశాఖపట్టణం విజయనగరం రోడ్డులో నిర్మించాలని సూచించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతమైన పాలనను అందించడానికి రాష్ట్రాన్ని నాలుగు జోన్‌లుగా విభజించాలని తాము ప్రభుత్వాన్ని సూచించామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు మీడియాకు తెలిపారు.

కాగా ఈరోజు ఉదయం నుండి కొన్ని ఛానెల్స్ లో విశాఖపట్టణాన్ని తుఫానులు సంభవించే ప్రాంతంగా జియన్ రావు గుర్తించిందని అందువల్ల ఇది రాజధాని నిర్మాణకి అనువైన ప్రదేశం కాదంటూ జియన్ రావు కమిటీ ప్రభ్యుత్వానికి సూచించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన జియన్ రావు విశాఖపట్నం దేశంలోని ఉత్తమ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తాము ప్రభుత్వానికి సూచించామని, హైకోర్టు ఏర్పాటుతో కోర్టు కి సంబందించిన విభాగాలన్నీ కర్నూలు పట్టణానికి వస్తాయని, కర్నూలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న 120 టిఎంసి ల నికరజలాలను వాడుకుంటే రాయలసీమ అభివృద్ధి బాట పడుతుందని జియన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. జియన్ రావు ప్రకటనతో ఈ ఉదయం నుండి విశాఖపట్టణం రాజధాని ఏర్పాటుకి పనికిరాదని జియాన్ రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చేస్తున్న ప్రచారానికి తెరపడింది. ఇదే సమయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి