iDreamPost

Glenn Maxwell: ఆస్పత్రిలో చేరిన మ్యాక్స్​వెల్.. ఆసీస్ ఆల్​రౌండర్​కు అసలు ఏమైంది?

  • Published Jan 24, 2024 | 10:10 AMUpdated Jan 24, 2024 | 10:10 AM

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో అసలు అతడికి ఏమైందంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మ్యాక్సీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో అసలు అతడికి ఏమైందంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మ్యాక్సీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం..

  • Published Jan 24, 2024 | 10:10 AMUpdated Jan 24, 2024 | 10:10 AM
Glenn Maxwell: ఆస్పత్రిలో చేరిన మ్యాక్స్​వెల్.. ఆసీస్ ఆల్​రౌండర్​కు అసలు ఏమైంది?

క్రికెటర్లను అభిమానించే వాళ్లు కోట్లలో ఉన్నారు. చిన్నాపెద్ద అనే తేడాల్లేకుండా చాలా మంది ప్లేయర్లను ఇష్టపడతారు. అందుకే గ్రౌండ్ లోపలే కాదు బయట కూడా క్రికెటర్లు క్రమశిక్షణతో మెలగాలని మాజీలు సూచిస్తుంటారు. దీని వల్ల వారిని అభిమానించే వాళ్లు కూడా అలాగే ఉంటారని చెబుతుంటారు. అయితే కొందరు క్రికెటర్లు మాత్రం గ్రౌండ్​లో బుద్ధిగానే నడుచుకున్నా బయట మాత్రం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటారు. లేట్ నైట్ పార్టీలతో వార్తల్లో ఒకటిగా నిలుస్తారు. గేమ్​తో, తమ స్కిల్స్​తో స్ఫూర్తిగా నిలవాల్సిన వారు.. అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ పరిస్థితి అలాగే ఉంది. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న మ్యాక్స్​వెల్ మద్యం తాగి, స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. అసలు మ్యాక్సీకి ఏమైందని అంతా ఆరా తీస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని అడిలైడ్​లో ఇటీవల ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ‘సిక్స్ అండ్ ఔట్’ అనే బ్యాండ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మ్యాక్స్​వెల్​తో పాటు పలువురు ఆసీస్ క్రికెటర్లు అటెండ్ అయ్యారు. మ్యాక్సీ అక్కడ చాలా సేపు గడిపాడు. ఫ్యాన్స్​కు ఆటోగ్రాఫ్​లు ఇస్తూ, ఫొటోలు దిగుతూ సరదాగా కనిపించాడు. అయితే ఆ తర్వాత ఫ్రెండ్స్​తో కలసి తాగడం మొదలుపెట్టాడు స్టార్ ఆల్​రౌండర్. అతిగా మద్యం తాగడంతో స్పృహ కోల్పోయాడని సమాచారం. మ్యాక్సీని లేపేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారట ఫ్రెండ్స్. అయితే వెళ్లే దారిలో అతడికి స్పృహ వచ్చిందట. హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకొని మ్యాక్సీ వెళ్లిపోయాడని ఆసీస్ మీడియా చెబుతోంది. ఈ ఘటన మీద క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సీరియస్ అయ్యాడు. అసలు ఏం జరిగిందనేది మ్యాక్సీనే చెప్పాలన్నాడు.

maxwell in hospital

‘ఆ మ్యూజిక్ కాన్సర్ట్​లో నేనూ ఉన్నా. కానీ నేను ముందుగానే వెళ్లిపోయా. మనం అన్నీ తెలిసినవాళ్లం. ఎవరు తీసుకొనే డిసిషన్స్​కు వాళ్లే బాధ్యులు. ఇది క్రికెట్​కు సంబంధించిన విషయం కాదు. మ్యాక్స్​వెలే అన్నింటికీ ఆన్సర్ ఇవ్వాలి’ అని కమిన్స్ స్పష్టం చేశాడు. ఈ ఘటనపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘అంబులెన్స్ ఎక్కే వరకు వెళ్లడమంటే ఆందోళనగా ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయంలో లోతుగా ఆలోచించాలి. అక్కడ కెమెరాలు.. చుట్టూ జనం ఉన్నారు. నిజం అదే తెలుస్తుంది’ అని క్లార్క్ చెప్పాడు. ఇక, వన్డే వరల్డ్ కప్​లో బ్యాట్​, బాల్​తో మెరిసిన మ్యాక్స్​వెల్.. బిగ్​బాష్​ లీగ్​లో ఫెయిలయ్యాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెల్​బోర్న్ స్టార్స్ ఫైనల్​కు వెళ్లడంలో విఫలమవడంతో కెప్టెన్సీ నుంచి అతడు తప్పుకున్నాడు. దీనికి తోడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి వెస్టిండీస్​తో జరిగే మూడు వన్డేల సిరీస్​లో తలపడే ఆసీస్ టీమ్​లోనూ అతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇలా పూటుగా తాగి స్పృహ తప్పి పడిపోవడంతో మ్యాక్సీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతడు తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. మరి.. మ్యాక్సీ​ ఆస్పత్రిలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి