iDreamPost

టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్? BCCI నుండి త్వరలోనే అధికారిక ప్రకటన?

  • Published May 28, 2024 | 5:30 PMUpdated May 28, 2024 | 5:49 PM

Gautam Gambhir, Head Coach, BCCI: టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌గా ఎవరు వస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. చాలా కాలంగా వినిపిస్తున్న గంభీర్‌ పేరునే బీసీసీఐ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Gautam Gambhir, Head Coach, BCCI: టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌గా ఎవరు వస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. చాలా కాలంగా వినిపిస్తున్న గంభీర్‌ పేరునే బీసీసీఐ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 28, 2024 | 5:30 PMUpdated May 28, 2024 | 5:49 PM
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్? BCCI నుండి త్వరలోనే అధికారిక ప్రకటన?

రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే ఉత్కంఠకు తెరదిగేలా ఉంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను ఖారారు అయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. గంభీర్‌ టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా వస్తాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్న క్రమంలో.. బీసీసీఐ పెద్దల నుంచి ఈ విషయంపై ఒక క్వాలిరిటీ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఫిక్స్‌ అయినట్లు.. త్వరలోనే దీనిపై బీసీసీఐ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌ 2024 తర్వాత ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త హెడ్‌ కోచ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టి.. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు ఆ పదవీలో కొనసాగనున్నాడు.

అయితే.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ రావాలని చాలా మంది క్రికెట్‌ అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ద్రవిడ్‌ చాలా కూల్‌ పర్సన్‌ అని.. కానీ, గంభీర్‌ అలా కాదు, మంచి అగ్రెసివ్‌ పర్సన్‌.. టీమ్‌ నుంచి తనకు కావాల్సిన రిజల్ట్‌ కోసం మొహమాటం లేకుండా ఆటగాళ్లను పిండేయగల ఘనడు. అలాగే ఐపీఎల్‌లో మెంటర్‌గా గంభీర్‌కు మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఐపీఎల్‌ 2022 నుంచి మెంటర్‌గా పనిచేస్తున్న గంభీర్‌ మెరుగైన ఫలితాలు సాధించాడు. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు మెంటర్‌గా వ్యవహరించాడు గంభీర్‌. ఆ రెండు సీజన్స్‌లోనూ లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ, ఈ ఏడాది మాత్రం ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. దీంతో.. లక్నోపై గంభీర్‌ ప్రభావం ఎంతుందో అర్థమవుతోంది.

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కంటే ముందు.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కో-ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌ పిలుపుమేరకు కేకేఆర్‌కు మెంటర్‌గా వచ్చాడు గంభీర్‌. వచ్చి రావడంతోనే తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. కేకేఆర్‌కు చంద్రకాంత్‌ పండిట్‌ లాంటి డొమెస్టిక్‌ హీరో కోచ్‌గా ఉన్నప్పటికీ.. గంభీర్‌ రాకతో కేకేఆర్‌ రూపురేఖలే మారిపోయాయి. జట్టులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చేసిన మార్పులు, బౌలర్లను ఇతర ప్లేయర్లను నమ్మిన విధానంతో కొత్త కేకేఆర్‌ను చూపించాడు. పైగా అతని కెప్టెన్సీలోనే కేకేఆర్‌ 2012, 2014 సీజన్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు గంభీర్‌ రాకతోనే కేకేఆర్‌ కప్పుకొట్టింది. ఈ ట్రాక్‌ రికార్డును, గేమ్‌ పట్ల గంభీర్‌కు ఉన్న ప్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి తనకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి