iDreamPost

వైరల్ వీడియోపై గౌతం గంభీర్ రియాక్షన్.. మళ్లీ అలాగే చేస్తానంటూ..!

  • Author singhj Published - 09:57 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 09:57 PM, Mon - 4 September 23
వైరల్ వీడియోపై గౌతం గంభీర్ రియాక్షన్.. మళ్లీ అలాగే చేస్తానంటూ..!

క్రికెట్​కు భారత్ అందించిన గొప్ప ఆటగాళ్ల జాబితాలో గౌతం గంభీర్, విరాట్ కోహ్లీల పేర్లు తప్పకుండా ఉంటాయి. అంతగా జెంటిల్మన్ గేమ్​పై ఈ ఇద్దరు ప్లేయర్లు తమ ప్రభావం చూపారు. టీమిండియా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్​లు నెగ్గడంలో గంభీర్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తీవ్ర ఒత్తిడి మధ్య ఆ రెండు టోర్నీల ఫైనల్స్​లో అతడు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్​లు చిరకాలం గుర్తుండిపోతాయి. ఇక, విరాట్ కోహ్లీ అయితే అసామాన్య ప్రతిభతో అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ రన్‌ మెషీన్​గా పేరు తెచ్చుకున్నాడు.

పదిహేనేళ్లుగా నిలకడగా ఆడుతూ ప్రస్తుత తరంలో బెస్ట్ క్రికెటర్​గా పేరు సంపాదించాడు విరాట్. అలాంటి గంభీర్, కోహ్లీల్లో ఒక కామన్ విషయం ఉంది.. అదే అగ్రెషన్. ఫీల్డ్​లో ఉన్నప్పుడు వీళ్ల జోలికి ఎవరైనా వెళ్తే ఇక అంతే సంగతులు. అలాంది వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదనేది తెలిసిందే. ఐపీఎల్​-2023లో భాగంగా ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన ఒక మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్​లు బాహాబాహీకి దిగడం తెలిసిందే. ఈ గొడవ ముగిసి చాన్నాళ్లు అవుతున్నా కోహ్లీ ఫ్యాన్స్ గౌతీని వదలడం లేదు. ఇవాళ ఇండియా-నేపాల్ మ్యాచ్ జరుగుతున్న టైమ్​లోనూ గంభీర్​పై కామెంట్స్ చేశారు విరాట్ అభిమానులు.

మ్యాచ్ జరుగుతున్న స్టేడియం దగ్గరకు గంభీర్ వచ్చి వెళ్తున్న సమయంలో విరాట్ ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ గోల చేశారు. దీంతో వెనక్కి తిరిగిన గంభీర్ చాలా కోపంతో కేకలు వేస్తున్న వారికి అభ్యంతరకరంగా మిడిల్ ఫింగర్ చూపించి వెళ్లాడు. గంభీర్ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై తాజాగా గౌతీ రియాక్ట్ అయ్యాడు. కొందరు పాకిస్థాన్ ఫ్యాన్స్ భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే తాను అలా స్పందించానని.. ఇదే వాస్తవమన్నాడు గంభీర్. ఒకవేళ ఇండియాకు వ్యతిరేకంగా మరోసారి కామెంట్లు చేస్తే మళ్లీ తాను అలాగే రియాక్ట్ అవుతానని గౌతీ స్పష్టం చేశాడు. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత జట్టులో ఆ ఇద్దరే నా ఫేవరెట్: నేపాల్ నటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి